ETV Bharat / state

ఆర్టీసీ ఎండీకి ఈపీఎఫ్​వో నోటీసులు

తెలంగాణ ఆర్టీసీ రెండేళ్లుగా కార్మికులు, ఉద్యోగులకు యాజమాన్య వాటా కింద భవిష్య నిధి చెల్లించడం లేదు. కార్మికుల వేతనాల నుంచి ఉద్యోగి వాటాగా మినహాయించిన సొమ్మునూ ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాలో జమ చేయలేదు. ఈ కారణంగా ఎగవేతదారుగా ఉద్యోగుల భవిష్య నిధి సంఘం వద్ద నమోదైంది. మొత్తం 760.62 కోట్ల రూపాయాలు జమ చేయకుండా ఆర్టీసీ యాజమాన్యం బాకీ పడినట్లు ఈపీఎఫ్​వో గుర్తించింది. దీనిపై ఈ నెల 15లోగా పూర్తి వివరాలతో హాజరుకావాలని సంస్థ ఎండీకి నోటీసులు జారీ చేసింది.

ఆర్టీసీ ఎండీకి ఈపీఎఫ్​వో నోటీసులు
author img

By

Published : Nov 9, 2019, 4:48 AM IST

ఈపీఎఫ్ చట్టంలోని నిబంధనల మేరకు కొన్ని యాజమాన్యాలకు ఈపీఎఫ్ పర్యవేక్షణలో సొంతంగా ట్రస్టు ఏర్పాటు చేసి ఉద్యోగుల భవిష్యనిధిని నిర్వహించేందుకు సంఘం మినహాయింపు ఇస్తోంది. ఉమ్మడి ఆర్టీసీకి ఈ మినహాయింపు ఉంది. దీని ప్రకారం ఉద్యోగి వాటా, యాజమాన్య వాటను కలిపి నిధిగా ఏర్పాటు చేసి, ఆ నిధిని ఈపీఎఫ్​వో మార్గదర్శకాల మేరకు ఆర్టీసీ నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఆర్టీసీలో గత కొన్నేళ్లుగా ఈపీఎఫ్ నిధులను సంస్థ అవసరాలకు మళ్లించడం సకాలంలో ఉద్యోగి ఖాతాలో పీఎఫ్ చెల్లించకుండా డీఫాల్ట్ కావడం పరిపాటిగా మారింది.

హెచ్చరించినా మారలేదు...

గతంలో పలుమార్లు నోటీసులు ఇచ్చి క్రిమినల్ చర్యలు తీసుకుంటామని సంఘం హెచ్చరించగా ఆర్టీసీ కొంత నిధిని చెల్లించింది. మళ్లీ రెండేళ్లుగా యాజమాన్య ఉద్యోగి వాటా (కార్మికుడి మూలవేతనం, డీఏ వేతనంలో 12 శాతం) చెల్లించడం లేదు. ఇలా 760 కోట్ల రూపాయలు పీఎఫ్ ట్రస్టులో జమ చేయలేదని తనిఖీలో గుర్తించారు.

ఆర్టీసీ మినహాయింపు హోదా రద్దా?

ఉద్యోగి పింఛను పథకానికి యజమాని చెల్లించాల్సిన వాటాను జమ చేయకపోవడం వల్ల పింఛను లెక్కింపులోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి వివరాలతో తమ ముందు హాజరుకావాలని సంఘం ఆదేశించింది. పీఎఫ్ ట్రస్టులో నిల్వలు, బాకీలపై మరోసారి మదింపు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది.

ఇందులో భాగంగా క్రిమినల్ చర్యలతో పాటు ఆస్తుల జప్తు ఆలోచన చేస్తోంది. కార్మికులకు రావాల్సిన బాకీలను వసూలు చేసిన తర్వాత మినహాయింపు హోదాని రద్దు చేసే అవకాశముంది. ఆ హోదా రద్దయితే ఆర్టీసీ పీఎఫ్ కార్యకలాపాలన్నీ ఈపీఎఫ్​వో పరిధిలోకి వెళ్తాయి.

ఇవీ చూడండి: ఆర్టీసీపై సీఎం​ సమీక్ష... హైకోర్టు వ్యాఖ్యలపై కీలకచర్చ

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.