ETV Bharat / state

ఆంగ్లం ఉచ్ఛారణ కోసం 'ఇంగ్లీష్ ప్రొ': ఇఫ్లూ వీసీ

ప్రభుత్వ ఉపాధ్యాయులకు బోధనలో మెరుగైన చిట్కాలు అందించేందుకు ఇఫ్లూ ముందుకొచ్చింది. విద్యార్థులకు పలు విదేశీ బాషల్లో శిక్షణ ఇచ్చేందుకు, ఆంగ్లం ఉచ్ఛారణపై బోధించేందుకు 'ఇంగ్లిష్ ప్రొ' పేరుతో మొబైల్ యాప్​ను త్వరలో ప్రారంభించనున్నామని ఇఫ్లూ వీసీ స్పష్టం చేశారు.

ఆంగ్లం ఉచ్ఛారణ కోసం 'ఇంగ్లీష్ ప్రొ': ఇఫ్లూ వీసీ
author img

By

Published : May 11, 2019, 8:52 AM IST

ఆంగ్లం ఉచ్ఛారణ కోసం 'ఇంగ్లీష్ ప్రొ': ఇఫ్లూ వీసీ

హైదరాబాద్​లోని ఖైరతాబాద్​ రాజ్ భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు ఉత్తమ బోధన పద్ధతులపై జులైలో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ఇఫ్లూ ముందుకొచ్చింది. రాజ్ భవన్​లో గవర్నర్ నరసింహన్​ను ఇఫ్లూ వైస్ ఛైర్మన్ సురేష్ కుమార్ కలిశారు. యూఎస్ఆర్​లో భాగంగా ఉత్తమ బోధన పద్ధతులు, మెరుగైన ఫలితాల కోసం ఉపాధ్యాయలకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఇఫ్లూ వీసీ తెలిపారు. రాజ్ భవన్ పాఠశాల విద్యార్థులకు ఎంపిక చేసిన విదేశీ భాషల్లో శిక్షణను ఇచ్చే ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు.
యూఎస్ఆర్​లో భాగంగా కార్యక్రమం చేపట్టడం దేశంలో ఇదే మొదటిసారి అని గవర్నర్​కు వివరించారు. ఆంగ్లం, సంస్కృతం, హిందీ, రష్యన్, జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్, ఇటాలియన్, అరబిక్, జపనీస్, కొరియన్, చైనీస్, పర్షియన్ భాషల్లో 30 గంటలు ఉచితంగా ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ కోర్సును త్వరలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. గ్రామీణ విద్యార్థులు, నిరుద్యోగ విద్యార్థులకు ఆంగ్లం ఉచ్ఛారణపై బోధిన అందించేందుకు 'ఇంగ్లిష్ ప్రొ' పేరుతో మొబైల్ యాప్​ను త్వరలో ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.

ఇవీ చూడండి :ముగిసిన రెండోవిడత స్థానిక పోలింగ్

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.