ETV Bharat / state

Karvy Case : కొనసాగుతున్న కార్వీ ఛైర్మన్​ విచారణ

బ్యాంకులను మోసం చేసిన కేసులో కార్వీస్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ ఛైర్మన్ పార్ధసారథిని ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పార్ధసారథిని జైలు ప్రాంగణంలోని ఓ గదిలో ఉంచి ఈడీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

Karvy Case
Karvy Case
author img

By

Published : Sep 6, 2021, 7:15 PM IST

కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ వేల కోట్ల నిధుల అక్రమాల వ్యవహారం ఆరా తీసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఆ సంస్థ ఛైర్మన్‌ పార్ధసారథిని ఈడీ విచారిస్తోంది. సీసీఎస్​ పోలీసుల దర్యాప్తు సాగుతుండగానే... మనీలాండరింగ్​పై ఈడీ దర్యాప్తు చేపట్టింది. నిధులు ఎక్కడికి మళ్లించారనే అంశంపై దర్యాప్తు సంస్థ దృష్టి పెట్టింది.

చంచల్​గూడ జైలులో రిమాడ్​ ఖైదీగా ఉన్న కార్వీ ఛైర్మన్​ పార్ధసారథిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. జైలు ప్రాంగణంలోని ఓ గదిలో ఉంచి వివరాలు సేకరిస్తున్నారు. పెట్టుబడిదారులకు చెందిన షేర్లను... కార్వీ ఖాతాలోకి మళ్లించుకున్న పార్ధసారథి... ఆ షేర్లను బ్యాంకుల్లో తనఖా పెట్టి దాదాపు 1200కోట్ల రుణం తీసుకున్నాడు. రుణాన్ని పలు డొల్ల కంపెనీల్లోకి మళ్లించి మోసాలకు పాల్పడ్డాడు. మనీల్యాండరింగ్​కు పాల్పడినందుకు ఈడీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకుల నుంచి రుణం తీసుకొని ఎక్కడికి మళ్లించాడనే వివరాలు సేకరిస్తున్నారు. నిన్నటి నుంచి పార్ధసారథిని ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు.... కార్వీ లావాదేవీలకు సంబంధించిన వివరాలు సేకరించారు. కార్వీ బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించిన ఈడీ అధికారులు.... వాటిని పార్ధసారథి వద్ద ప్రస్తావించారు.

డొల్ల కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి నష్టాలు చూపించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. 9 డొల్ల కంపెనీల్లో డైరెక్టర్లుగా ఎక్కువ మంది.. కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్​కు చెందిన సాధారణ ఉద్యోగులే అని తేలింది. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్​పై ఇప్పటికే రెండు కేసులు నమోదు చేశారు. పార్ధసారథితో పాటు రాజీవ్ సింగ్, కృష్ణహరి, శైలజను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. ఆర్థిక లావాదేవీల్లో మోసాలను ఆధారంగా చేసుకొని ఈడీ అధికారులు కార్వీ సంస్థపై మరిన్ని కేసులు నమోదు చేసే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: KARVY CASE: కార్వీ ఎండీ పార్ధసారథి విచారణకు అనుమతి కోరిన ఈడీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.