Enforcement Directorate: బ్యాంకులను మోసంచేసి మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న అభియోగంపై పీసీహెచ్ గ్రూప్ డైరెక్టర్ బల్వీందర్ సింగ్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. పీసీహెచ్ గ్రూప్ సంస్థల పేరిట.. బల్వీందర్ సింగ్ వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని సుమారు 370 కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డారని చెన్నై, బెంగళూరులో సీబీఐ గతంలో కేసులు నమోదు చేసింది.
సీబీఐ కేసుల ఆధారంగా మనీలాండరింగ్‌పై ఈడీ దర్యాప్తు చేస్తోంది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను డొల్ల కంపెనీల ద్వారా తమ వ్యక్తిగత, సంస్థల ఖాతాలకు మళ్లించుకున్నట్లు తేలిందని ఈడీ వెల్లడించింది. బ్యాంకులకు రుణాలు తిరిగి చెల్లించకుండా మోసం చేశారని పేర్కొంది. బల్వీందర్ సింగ్‌కు న్యాయస్థానం ఈనెల 23 వరకు రిమాండ్ విధించింది. అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు.
ఇదీచూడండి: ED Seized Loan App Company Funds : ఆ విషయంలో ఈడీని సమర్థించిన ఫెమా