ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌పై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డ.. ఎన్నికల కమిషనరా..? రాజకీయ పార్టీ నాయకుడా..? అని ప్రశ్నించారు. జిల్లాల్లో తిరుగుతూ ప్రభుత్వాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న రమేశ్‌కుమార్... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కించపరిచే విధంగా ప్రవర్తిస్తే ప్రజలు ఉపేక్షించరని హెచ్చరించారు. నిమ్మగడ్డ తాత్కాలికంగా లబ్ధి పొందటమేనని.. అంతిమ విజయం తమదేనన్నారు. నిమ్మగడ్డ వ్యవహారశైలి భిన్నంగా ఉందని... పదవీ విరమణ అనంతరం రాజకీయ ప్రవేశం కోసం తాపత్రయ పడుతున్నట్లు ఉందని విమర్శించారు.
విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి వెల్లంప్లలి శంకుస్థాపన చేశారు. రూ.5 కోట్లతో నిర్మించ తలపెట్టిన రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
ఇదీ చదవండి: 'తెలంగాణకు వరద సాయంలో కిషన్‌రెడ్డిది కీలకపాత్ర'