ETV Bharat / state

Artisans strike: ముగిసిన ఆర్టిజన్ల సమ్మె.. తొలగించిన 200మందికి త్వరలోనే పోస్టింగ్

TS Artisans strike close: విద్యుత్​ సంస్థలో పనిచేస్తోన్న ఆర్టిజన్లు.. సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఇవాళ ట్రాన్స్​కో జెన్కో సీఎండీ ప్రభాకర్​ రావును కలిసిన ఉద్యోగ సంఘాల నేతలు.. చర్చలు ఫలించడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఉద్యోగులు యథావిధిగా విధులకు హాజరుకావాలని సూచించారు.

power
power
author img

By

Published : Apr 26, 2023, 7:21 PM IST

TS Artisans strike close: వేతన సవరణ, ఫిట్​మెంట్​ విషయంలో తమకు సరైన న్యాయం జరగలేదని ఆరోపిస్తూ.. విద్యుత్​ సంస్థలో పనిచేస్తోన్న ఆర్టిజన్ల తలపెట్టిన సమ్మె.. ఇవాళ ముగిసింది. క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేస్తోంది తామేనని, తమకు ఫిట్​మెంట్ విషయంలో సరైన న్యాయం జరగడం లేదని అనేక ఏళ్లుగా తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆర్టిజన్లు సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో ఇవాళ ఉదయం సమ్మెకు దిగిన ఉద్యోగులు సాయంత్రానికి సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు.

ఈ మేరకు ఇవాళ ట్రాన్స్​కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు, డిస్కంల సీఎండీలతో చర్చలు జరిపిన ఉద్యోగ సంఘాల నేతలు చర్చలు ఫలించినట్లు తెలిపారు. దీంతో సమ్మె విరమిస్తున్నట్లు తెలంగాణ విద్యుత్ ఎంప్లాయ్స్ యూనియన్ (హెచ్​82) ప్రధాన కార్యదర్శి ఎస్.సాయిలు స్పష్టం చేశారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే మలక్​పేట ఎమ్మెల్యే అహ్మద్​ బలాల హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ప్రకటించారు.

Electricity employees strike: తమ సమస్యలను సీఎం కేసీఆర్​తో మాట్లాడి పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చినట్లు తెలిపారు. సమ్మెలో ఉన్నవారు తక్షణమే విధులకు హాజరుకావాలని సాయిలు విజ్ఞప్తి చేశారు. తొలగించిన 200 మంది ఆర్టిజెన్స్​ను 10 రోజుల్లో విధుల్లోకి తీసుకొంటామని సీఎండీ ప్రభాకర్ రావు హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.

ఆర్డిజన్ల ప్రధాన డిమాండ్​లు: కొద్ది రోజులుగా రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగుల సమ్మె చర్చనీయాంశంగా మారింది. గత సంవత్సర కాలంగా సరైన వేతన సవరణ లేక ఫిట్‌మెంట్‌ రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విద్యుత్ ఉద్యోగులు చెబుతున్నారు. ప్రస్తుతం ఏడు శాతం ఉన్న ఫిట్​మెంట్​ కనీసం 20 శాతంగా ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్నారు. ఆర్టిజన్ల పేరుతో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్‌ చేసి శాశ్వత ఉద్యోగులతో సమానంగా పేస్కేల్‌ ఇవ్వాలని.. శాశ్వత ఉద్యోగులతో సమానంగా అన్ని రకాల సెలవులు కూడా వర్తింపజేయాలని విద్యుత్​ ఉద్యోగుల ప్రధాన డిమాండ్​లు.

"గౌరవ ఎమ్మెల్యే అహ్మద్​ బలాల సహాయంతో ఇవాళ విద్యుత్​ సౌధలో సీఎం కేసీఆర్​తో మాట్లాడటం జరిగింది. సీఎండీ ప్రభాకర్​రావుతో చర్చలు అనంతరం వారు మా డిమాండ్​లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమ్మె విరమిస్తున్నట్లు అధికారికంగా ప్రకటిస్తున్నాం. సమ్మెలో ఉన్నవారు విధులకు హాజరుకావలని విజ్ఞప్తి చేస్తున్నాను. తొలగించిన 200మంది ఆర్టిజన్లు వారం పదిరోజుల్లో తిరిగి పోస్టింగ్​ ఇస్తామని సీఎండీ చెప్పారు".-ఎస్.సాయిలు, తెలంగాణ విద్యుత్ ఎంప్లాయ్స్ యూనియన్ (H82) ప్రధాన కార్యదర్శి

ఇవీ చదవండి:

Artisans Sacked: సమ్మెలో పాల్గొన్నందుకు .. 200 మంది ఆర్జిజన్ల తొలగింపు

REVANTH REDDY: 'రైతులకు కావాల్సింది రైతు బీమా కాదు.. పంట బీమా'

Crop loss in Nizamabad: రైతుకు కడగండ్లను మిగిల్చిన వడగండ్ల వాన..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.