Election officer Vikasraj: మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. లెక్కింపు ప్రక్రియ పూర్తయిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. దేశం మొత్తం దృష్టి మునుగోడు ఉప ఎన్నికపై ఉందని.. ఎక్కడా పక్షపాతం లేకుండా ఎన్నికల ప్రక్రియ నిర్వహించామన్నారు. ఆరోపణలు ఎన్ని వచ్చినా.. నియమావళి అనుగుణంగానే వ్యవహరించామని స్పష్టం చేశారు.
అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నందునే ఓట్ల లెక్కింపులో ఆలస్యమైందని ఆయన తెలిపారు. ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరిగిందని.. ఎక్కడా లోపం తలెత్తలేదని తేల్చి చెప్పారు. వ్యక్తిగత తప్పిదం చేసినందునే ఆర్వోపై వేటు పడిందని వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా పూర్తవడానికి సహకరించిన సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఎన్నికల కోడ్ నవంబరు 8న ముగుస్తుందని తెలిపారు.
ఇవీ చదవండి: