ETV Bharat / state

టీసీఎస్​ఎస్ అధ్యక్షుడిగా నీలం మహేందర్ ఎన్నిక - Telangana news

తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్(టీసీఎస్​ఎస్) అధ్యక్షుడిగా నీలం మహేందర్ ఎన్నికయ్యారు. టీసీఎస్​ఎస్ ఏడో వార్షిక సర్వసభ్య సమావేశం జూమ్ యాప్ ద్వారా నిర్వహించారు.

టీసీఎస్​ఎస్ అధ్యక్షుడిగా నీలం మహేందర్ ఎన్నిక

author img

By

Published : Dec 20, 2020, 5:09 PM IST

తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్(టీసీఎస్​ఎస్) ఏడవ వార్షిక సర్వసభ్య సమావేశం జూమ్ యాప్ ద్వారా నిర్వహించారు. ఈ సమావేశంలో సుమారు 100 మంది సభ్యులు పాల్గొన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు నీలం మహేందర్, కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ప్రతిపాదించారు. నామినేషన్ గడువులోగా ఒకే టీమ్ నుంచి నామినేషన్ రాగా ప్రస్తుత కార్యవర్గం ఎన్నికకు ఎలాంటి పోటీ లేకుండా పోయింది.

ఎన్నికల అధికారులు నవీన్ ముద్రకొల్ల, దోర్నాల చంద్రశేఖర్, నీలం మహేందర్​ను అధ్యక్షుడిగా ప్రకటించారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను మరోసారి అప్పగించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నూతన కార్యవర్గం సహకారంతో సొసైటీని మరింత అభివృద్ధి చేయడానికి శాయశక్తుల కృషి చేస్తానని పేర్కొన్నారు. మొదటి ఆన్​లైన్​ సర్వసభ్య సమావేశం సాఫీగా జరగడానికి సహకరించిన సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చూడండి: మనసులు గెలిచిన ప్రేమ.. మరణం ముందు ఓడింది.!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.