ETV Bharat / state

ఓటర్లను ప్రలోభ పెట్టేవి తప్ప ఇతర సామాగ్రి సీజ్ చేయొద్దు : సీఈసీ - ఎన్నికల ప్రచార ఏర్పాట్లపై ఈసీ

Election Commission Orders To Commercial Tax Department : ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఉపయోగించేవితప్ప ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకోవద్దని.. వాణిజ్య పన్నులశాఖను ఎన్నికల సంఘం ఆదేశించింది. పార్టీ గుర్తులు, ఫోటోలు కలిగిన వస్తుసామాగ్రి, అనధికారిక గోదాముల్లో నిల్వచేసిన వస్తువులను మాత్రమే జప్తుచేయాలని ఈసీ స్పష్టం చేసింది. అభ్యర్థులు నిర్వహించే సభలు, సమావేశాలపై దృష్టిసారించి అందుకయ్యే ఖర్చును.. వారి వ్యయం కింద జమ చేయాలని అధికారులను వాణిజ్య పన్నులశాఖ కమిషనర్‌ ఆదేశించారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Election Commission on Commercial Tax Department
Election Commission
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 8, 2023, 8:33 AM IST

ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఉపయోగించేవితప్ప ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకోవద్దు : సీఈసీ

Election Commission on Commercial Tax Department : రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) గత నెల 9న ప్రకటించింది. ఆ రోజు నుంచి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఉపయోగించే 26 రకాల వస్తువుల సరఫరా, నిల్వలపై వాణిజ్య పన్నులశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. డివిజన్ల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలతో వాహన తనిఖీలు, గోదాముల తనిఖీలు, రైల్వే, ఆర్టీసీ, ప్రైవేటు పార్సిల్‌ సర్వీస్‌ కేంద్రాలను తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈనెల 3వ తేదీ వరకు 26 కోట్లకు పైగా విలువ చేసే వివిధ వస్తు సామాగ్రిని వాణిజ్య పన్నులశాఖ సీజ్‌ చేసింది.

Commercial Taxes Department Focus on Telangana Elections : అయితే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకేనన్న స్పష్టత లేకుండా సీజ్‌ చేయడం వల్ల వ్యాపార, వాణిజ్య వర్గాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు అందిన ఫిర్యాదులపై ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది. తాజా పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన ఎన్నికల సంఘం సాదారణ వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రలోభ వస్తు సామాగ్రిని నిలువరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో వాణిజ్య పన్నులశాఖ కమిషనర్‌ క్రిష్టినా ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించి చట్ట ప్రకారం నడుచుకోవాలని స్పష్టం చేశారు.

Commercial Taxes Department Focus on Assembly Elections : తాయిలాలు, ప్రలోభాలపై వాణిజ్య పన్నుల శాఖ నిఘా.. స్పెషల్​ టీమ్స్​తో దాడులు

Telangana Assembly Elections 2023 : ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే వస్తువులను మాత్రమే సీజ్‌ చేయాలని, పార్టీ గుర్తులు, ఫోటోలు ఉంటే జప్తు చేయాలని స్పష్టం చేశారు. అదేవిధంగా సంబంధిత రాజకీయ నాయకుడిపై కేసు నమోదు చేసి న్యాయస్థానానికి నివేదించిన తర్వాత 24 గంటలలోపు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి సీజ్‌కు చెందిన ప్రసీడింగ్స్‌ను పంపాల్సి ఉంటుంది. అదేవిధంగా వాణిజ్య పన్నులశాఖ అనుమతి లేని, అనధికారిక గోదాముల్లో రహస్యంగా ఉంచినట్లైతే.. సోదాలు నిర్వహించి సీజ్‌ చేయవచ్చని స్పష్టం చేశారు. ఇక్కడ వే బిల్స్‌, ఇన్‌ వాయిస్‌లు లేని సరుకులపై పన్ను విధింపుతో పాటు 200 శాతం అపరాధ రుసుం కూడా విధిస్తారు. వాహనాలను తనిఖీ చేసినప్పుడు.. ఆయా వాహనాలు వే బిల్లులు, ఇన్‌వాయిస్‌లు లేకుండా ఉన్నట్లయితే సీజ్‌ చేస్తారు.

EC on Election Campaign Arrangements : పీపుల్స్‌ రెప్రజంటేటివ్‌ చట్టం సెక్షన్‌ 123 (1) ప్రకారం అఫిడవిట్లు తీసుకుని చట్టపరమైన చర్యలకు వాణిజ్య పన్నులశాఖ ఉపక్రమిస్తోంది. శాసనసభకు పోటీ చేస్తున్న అభ్యర్థులు రూ.75 లక్షల వరకు వ్యయం చేసుకునే వెసులుబాటు ఎన్నికల సంఘం కల్పించింది. అయితే ఇది దాటి ఖర్చు చేసినట్లు తేలినట్లయితే సంబంధిత అభ్యర్థిపై అనర్హత వేటు పడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆయా అభ్యర్థులు నిర్వహిస్తున్న సభలను కూడా వాణిజ్య పన్నులశాఖ పర్యవేక్షిస్తుంది.

ఇక్కడ ఎంత మంది జనాభా సభలకు వచ్చారు. వారికి అందించిన ఆహారం, రవాణా ఇతర సౌకర్యలను పరిశీలిస్తారు. ఉదాహరణకు లక్ష మంది తరలి వచ్చారంటే.. వారిని తీసుకొచ్చేందుకు ఎన్ని వాహనాలు ఉపయోగించారు. వాటికి అయ్యిన డీజిల్‌, పెట్రోల్‌లకు ఖర్చు ఎంత అయింది. ఆహారం పెట్టిస్తే అందుకు అయిన ఖర్చు ఎంత.. శ్యామియానా రెంటు ఇలా వివిధ పద్దుల కింద పెట్టిన ఖర్చును అంచనా వేస్తారు. ఈ అంచనా వేసిన వివరాలను స్థానిక రిటర్నింగ్‌ అధికారి ద్వారా ఎన్నికల సంఘానికి నివేదిస్తారు.

తెలంగాణలో పక్కా ప్రణాళికతో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి : సీఈసీ

పోస్టల్ బ్యాలెట్లు దుర్వినియోగం కాకుండా ఈసీ కొత్త రూల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.