Election Code Violations in Telangana : ఎన్నికల సంఘం ఆదేశాలతో.. రాష్ట్రంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పార్టీల ప్రయత్నాలకు వాణిజ్య పన్నులశాఖ అడ్డుకట్ట వేస్తోంది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వివిధ వస్తువులు పంపిణీని కట్టడిచేయాలన్న ఈసీ ఆదేశాలతో.. 100కిపైగా ప్రత్యేక బృందాలతో దాడులతోపాటు, వాహన తనిఖీలు చేస్తోంది. రాష్ట్రంలోని 14 వాణిజ్య పన్నుల డివిజన్ కార్యాలయాల పరిధిలో ఒక్కో డివిజన్‌కు నాలుగు ప్రత్యేక బృందాలు లెక్కన 20 ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలను ఏర్పాటు చేశారు.
Telangana Assembly Elections 2023 : 28 అంతరరాష్ట్ర బోర్డర్ తనిఖీబృందాలతో.. 31 స్ట్రాటజిక్ పాయింట్లు ఏర్పాటుచేసి తనిఖీలు చేస్తున్నారు. డివిజన్‌స్థాయిలో వచ్చే వివరాలతోపాటు.. కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చే సమాచారంతో ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయి. 150కి పైగా ప్రత్యేక బృందాలకు సీటీవో, డీసీటీవో స్థాయి అధికారులు నేతృత్వం వహిస్తుండడంతో.. అక్కడక్కడే నిర్ణయాలు తీసుకొని ప్రలోభ వస్తువులను సీజ్ చేస్తున్నారు.
ప్రధానంగా నాయకుల బొమ్మలు, పార్టీ గుర్తులు కలిగిన.. చీరలు, కుట్టుమిషన్లు, పాఠశాల బ్యాగ్‌లు, క్రికెట్ కిట్లు, సీలింగ్ ఫ్యాన్లు, బెడ్‌షీట్లు, సైకిళ్లు, కాస్మోటిక్స్, జిమ్ పరికరాలు వంటి 26 వస్తువులను ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఉపయోగిస్తున్నట్లు ఎన్నిక సంఘం గుర్తించింది. గత నెల 9 నుంచి ఇప్పటి వరకు రైల్వే పార్సిల్ కార్యాలయాలు.. ట్రాన్స్‌పోర్టు గోడౌన్లు, ప్రైవేటు బస్సుల పార్సిల్ కేంద్రాలు, కొరియర్ సర్వీస్ కేంద్రాలు.. ఆర్టీసీ పార్సిల్ కేంద్రాలు, సరిహద్దు తనిఖీ కేంద్రాలు, వాహన తనిఖీలు తదితర వాటిపై ప్రత్యేక బృందాలు దాడులు చేస్తున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు నెల రోజుల్లో 453 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం
Police Focus on Temptations in Elections : బిల్లులు ఉండి సరఫరా చేస్తున్నట్లు గుర్తిస్తే వాటి విలువ ఆయా నాయకుల ఎన్నికల ఖర్చులో జమచేస్తున్నారు. ఇప్పటివరకు 27 కోట్ల విలువైన ప్రలోభ పెట్టేవస్తువులను.. స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అందులో రూ.5.18 కోట్లు విలువైన లక్షా 41వేల 372 రెడీమేడ్ గార్మెంట్స్, రూ.3.06 కోట్లు విలువైన 36,036 మొబైల్లు, రూ.2.90 కోట్లు విలువైన 61,346 చీరలు, 2.29 కోట్లు విలువైన 9665 స్టెయిన్ లెస్ స్టీల్ వస్తువులు ఉన్నాయి.
Police Seizes Money in Telangana : రూ. 1.81 కోట్లు విలువైన 1778 బంగారు, సిల్వర్ కోటెడ్ వస్తువులు, కోటి 34 లక్షలు విలువైన 808 బైక్‌లు, సైకిళ్లు, కోటి 34 లక్షలు విలువైన 15,388 బంగారు కోటెడ్ జువలరీ, రూ.1.31 కోట్లు విలువైన 9045 కుక్కర్లులతోపాటు బెడ్‌షీట్లు, ఫ్యాన్లు, పాఠశాల బ్యాగులు, జిమ్ పరికరాలు, క్రికెట్ కిట్లు, మిక్సీలు, వాచ్‌లు, బొమ్మలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, కుంకుభరిణిలు ఉన్నాయి.
అధికారపార్టీకి చెందిన ఓ మంత్రి, మరో ఎమ్మెల్యేకి చెందిన ఫోటోలు పార్టీ గుర్తులు కలిగిన స్టీల్‌గిన్నెలు, నీటిసీసాలు, లంచ్‌బాక్స్‌లు, టీషర్టులు తదితరవి స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇద్దరు ప్రజాప్రతినిధులపై కేసులు నమోదు చేసి ఎన్నికల అధికారికి నివేదించినట్లు తెలుస్తోంది. ఆ రెండు కేసులకు సంబంధించి రిటర్నింగ్ అధికారులు.. పూర్తి స్థాయిలో పరిశీలన చేసి తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది