ట్యాంక్ బండ్‌పై సండే ఈజ్ ఫన్ డే కార్యక్రమం... సత్ఫలితాలను ఇస్తుండటంతో నగర వాసులు విజ్ఞప్తి మేరకు... చార్మినార్ వద్ద కూడా నెలలో రెండు సార్లు ఇదే తరహా కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేశారు. ఆదివారం ప్రయోగాత్మకంగా ఏక్ శామ్ చార్మినార్ కె నామ్ పేరిట (Ek Shaam Charminar ke Naam) ప్రారంభించిన కార్యక్రమానికి... 50 వేల మంది వరకు సందర్శకులు తరలివచ్చారు. చార్మినార్ నుంచి మదీన కూడలి వరకు జనాలతో రోడ్లు కిక్కిరిసిపోయాయి. కుటుంబాలతో సహా చార్మినార్ వద్దకు చేరుకుని కార్యక్రమాన్ని తిలకించారు. చార్మినార్ నుంచి మక్కా మసీదు వెళ్లే దారిలో... ప్రత్యేక ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. పత్తర్ కా గోష్, కబాబ్స్, హలీం, బిర్యాని వంటి పాత బస్తీ రుచులు నగర వాసులను అలరించాయి (Ek Shaam Charminar ke Naam). మరో వైపు వివిధ రకాల డ్రై ఫ్రూట్స్, ఐస్‌క్రీంలు, ఫ్రూట్ సలాడ్‌లను నగరవాసులు ఎంతో ఇష్టంగా ఆస్వాదించారు. పలు రకాల అత్తరులు, దుస్తులు, గాజులు, బొమ్మలు చిన్నారులకు ఆనందాన్ని పంచాయి.
త్రివర్ణ కాంతుల్లో చార్మినార్..
కార్యక్రమం చూసేందుకు నరగవాసులతో పాటు పలు జిల్లాల నుంచి కూడా సందర్శకులు తరలివచ్చారు. చారిత్రాత్మక చార్మినార్‌ను త్రివర్ణ పతాక రంగులు.. విద్యుత్ వెలుగుల్లో చూసి ఆనందం వ్యక్తం చేశారు (Ek Shaam Charminar ke Naam ). సందర్శకులు కోసం ఏర్పాటు చేసిన పోలీస్ బ్యాండ్, నోటితో చేసే సంగీత ధ్వనులు... లేజర్ లైటింగ్ ఆకట్టుకున్నాయి.
భారీ భద్రత నడుమ
కుటుంబాలతో వచ్చిన నగరవాసులు... సాయంత్రం వేళ చార్మినార్ అందాలకు ముగ్ధులయ్యారు. సందర్శకుల భద్రత దృష్ట్యా అధికారులు సుమారు 200మంది పోలీసులను చార్మినార్ పరిసర ప్రాంతాల్లో మోహరించారు (Ek Shaam Charminar ke Naam ). మరి కొన్ని ఆకట్టుకునే కార్యక్రమాలు ఉంటే... బావుంటుందని సందర్శకులు అభిప్రాయపడ్డారు.
మరిన్ని విజ్ఞప్తులొచ్చే అవకాశం
ట్యాంక్ బండ్ పై "సండే ఈజ్ ఫన్ డే" (sunday is fun day)... చార్మినార్ వద్ద "ఏక్ శామ్ చార్మినార్ కె నామ్" (Ek Shaam Charminar ke Naam )తరహాలో... నగరంలో మరికొన్ని ప్రాంతాల్లో నిర్వహించేందుకు విజ్ఞప్తులు వెల్లువెత్తే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: EK SHAM CHARMINAR KE NAAM: సందడికి వేళైంది.. 'ఏక్ షామ్ చార్మినార్ కే నామ్' మొదలైంది.!