అక్కడ ఓ పెద్ద కాయ కనిపిస్తుంది కదా..? అదేంటని అడిగితే టక్కున ఎవరైనా.. ఏం చెబుతారు. గుమ్మడికాయ అని..! అవునా..! మీరు కూడా అలా అనుకుని పొరబడితే మాత్రం హల్వాలో కాలేసినట్టే..!
ఈ చిత్రంలో కనిపిస్తున్నది గుమ్మడికాయ అనుకుంటే పొరపాటే! ఆశ్చర్యం కలిగించినా.. అది వంకాయ. అవునండి.. నిజమే. అది వంకాయే. ములుగు జిల్లా, మంగపేట మండల కేంద్రంలో... ప్రభుత్వ ఉపాధ్యాయుడు ములకాల వెంకటస్వామి ఇంటి వద్దనున్న వంగచెట్టుకు కిలోకుపైగా బరువున్న ఈ వంకాయ కాసింది. దీన్ని చూసి ఆశ్చర్యపోవడం చూసినవారి వంతైంది.