ETV Bharat / state

కొండెక్కుతున్న కోడిగుడ్డు ధర.. సామాన్యుడికి గుండె దడ!

Egg Price Incresed : సండే వచ్చిందంటే చాలు ప్రతి ఇంటి కిచెన్​ నుంచి చికెన్​, మటన్​, ఫిష్ కర్రీ వాసనలే వస్తుంటాయి. మరి అవి తెచ్చుకోలేని వారు 'గుడ్డు'లోనే వాటిని చూసుకుని కడుపు నింపుకుంటుంటారు. ఇప్పుడు ఆ గుడ్డు తెచ్చుకోవాలన్నా.. ఒకటికి రెండుసార్లు ఆలోచించేలా చేస్తున్నాయి ప్రస్తుత రేట్లు. రోజురోజుకూ ధరలు కొండెక్కుతూ.. సామాన్యుడికి గుండె దడ వచ్చేలా చేస్తున్నాయి.

కొండెక్కుతున్న కోడిగుడ్డు ధర..
కొండెక్కుతున్న కోడిగుడ్డు ధర..
author img

By

Published : Dec 3, 2022, 10:03 AM IST

Egg Price Incresed : కోడిగుడ్ల ధరలు పెరిగాయి. డజను గుడ్ల ధర రూ.80కి పెరగగా.. ఒకదాని ధర రూ.7 అయింది. ఏడాదిగా డజను గుడ్లు రూ.65 నుంచి రూ.70 ఉండగా.. ఒకటి రూ.6కి వచ్చేది. 10 రోజుల్లోనే ఏకంగా డజను గుడ్ల ధర రూ. 80కి పెరిగింది. వినియోగంతో పాటు.. దానా ధరలు పెరగడమే అధిక ధరలకు కారణమని నేషనల్‌ ఎగ్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ (నెక్‌) బిజినెస్‌ మేనేజర్‌ సంజీవ్‌ చింతావార్‌ చెప్పారు. 2020లో గుడ్లు పెట్టే కోళ్లకు వేసే దానా ధర రూ.14 నుంచి 16 ఉండగా.. నేడు రూ.28 నుంచి 30కి పెరిగిందన్నారు.

ప్రస్తుతం డిమాండ్‌కు తగ్గట్టు కోడి గుడ్ల ఉత్పత్తి లేకపోవడం కూడా ధరల పెరుగుదలకు కారణమని నెక్‌ నిర్వాహకులు చెబుతున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో రోజూ 70 లక్షల గుడ్ల వినియోగం ఉంటుందని సంజీవ్‌ చెప్పారు.

ఇవీ చూడండి..

World Egg Day: పచ్చిగుడ్డు తాగితే మంచిదా? లేక ఉడికించి తినాలా?

మేనిని మెరిపించే గుడ్డు గురించి మనమూ తెలుసుకుందామా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.