ETV Bharat / state

ముందస్తు ప్రణాళికను అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది: ఈటల - ఈటల రాజేందర్​ వార్తలు

వాస్తవాలన్నీ బయటకు రావాలి: ఈటల రాజేందర్​

author img

By

Published : May 1, 2021, 2:43 PM IST

Updated : May 2, 2021, 4:52 AM IST

14:39 May 01

వాస్తవాలన్నీ బయటకు రావాలి: ఈటల రాజేందర్​

వాస్తవాలన్నీ బయటకు రావాలి: ఈటల రాజేందర్​

‘‘ఫిర్యాదులపై విచారణ చేసి.. న్యాయం ఏమిటో, అన్యాయమేమిటో తేల్చిన తర్వాత చర్యలు తీసుకోవటం లేదు. ముందుగానే ప్రణాళిక రూపొందించుకుని అన్నీ చేస్తున్నట్లు కనిపిస్తోంది. నా వ్యక్తిత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు చూస్తున్నారు. వీటన్నింటికీ రాబోయే కాలంలో మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రస్తుత పరిణామాలు కుట్రబుద్ధితో జరుగుతున్నాయని యావత్తు తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు’’ అని రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. శనివారం ఆయన తన నివాసం వద్ద తాజా పరిణామాలపై విలేకరులతో మాట్లాడారు.

‘‘20 సంవత్సరాలు పార్టీని పట్టుకుని ఏడ్చినందుకు ఈ గతి పట్టింది. ఇది తెలంగాణకు మంచిది కాదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. వారు అసహ్యించుకుంటున్నారు. ప్రలోభాల ప్రవాహాన్ని ఎదుర్కొని కొట్లాడిన వాణ్ని ఎలా తప్పు చేస్తా? వంద ఎకరాల్లో కబ్జా అయిందా? లేక అయిందని చెప్పిస్తున్నారా? ఎంత కబ్జా అయింది.. ఎక్కడ షెడ్లు కట్టారు? అన్నీ తేలాలి కదా. తేల్చనీయండి. నివేదిక వచ్చిన తర్వాత మాట్లాడతా. నా శాఖను ముఖ్యమంత్రి తీసుకున్నట్లు తెలిసింది. సంతోషం. మంత్రివర్గంపై సర్వాధికారం ముఖ్యమంత్రిదే. ఏ శాఖనైనా తీసుకోవచ్చు. మంత్రులెవరినైనా మార్చుకోవచ్చు.

కేసీఆర్‌తో ఒకసారి చెడితే అతకదు
‘‘కేసీఆర్‌తో ఒకసారి చెడితే మళ్లీ అతకదు. ఇన్నారెడ్డితో మొదలు పెడితే నాయిని నర్సింహారెడ్డి వరకు అదే జరిగింది. కేసీఆర్‌తో మళ్లీ అతుకుతుందని నేను భావించటం లేదు. 2018 ఎన్నికలప్పటి నుంచే నన్ను వెంటాడుతున్నారు. నాకు తెలియకుండానే నా ఇంటిపై ఎన్నికల సమయంలో రైడ్‌ చేయించారు. నా ప్రత్యర్థికి ఆర్థిక సహాయం చేశారు. ఒకసారి ఆర్డీవో ఒకరు నాతో భోజనం చేస్తే అదేదో జరిగినట్లు సృష్టించారు. కొత్తపార్టీ పెట్టాలని ఇప్పటి వరకు ఎప్పుడూ అనుకోలేదు. కొద్ది రోజులుగా కేటీఆర్‌ కొంత మంది పార్టీ నేతల ద్వారా నాకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నారు. మూడు రోజులుగా ఏదో జరుగుతోందని తెలిసింది. ఏమన్నా ఉంటే నేరుగా నాతో మాట్లాడొచ్చు కదా అని అడుగుదామనుకున్నా. కేటీఆర్‌ అందుబాటులోకి రాలేదు. అవతలి వాళ్లు ముందు స్క్రిప్ట్‌ రెడీ చేసుకుని అమలు చేశారు. మాట వినటం లేదన్న అక్కసుతోనే ఈ విధంగా కుట్ర చేశారు. కేసీఆర్‌ సంగతి నాకు బాగా తెలుసు. అంత ఈజీగా నన్ను వదలరు. అన్ని కోణాల్లో వెంటాడతారు. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో దేవరయాంజల్‌లో నాకున్న ఆరు ఎకరాల భూమిని దేవాలయ భూముల కోటాలో నమోదు చేశారు. అది ఇప్పటి వరకు క్లియర్‌ కాలేదు. ప్రస్తుతం ప్రజాస్వామ్య వాతావరణం ఎక్కడా కనిపించటం లేదు. ఎవరిపైనైనా దాడులు చేస్తున్నార’ అని విలేకరుల సమావేశం అనంతరం చిట్‌చాట్‌లో వ్యాఖ్యానించారు.

కార్యకర్తలతో ఈటల

సీఎంతో మాట్లాడే ప్రయత్నం చేయను

ప్రస్తుత పరిణామాలపై ముఖ్యమంత్రితో మాట్లాడేందుకు ప్రయత్నం చేయలేదు. ఇకపై చేయబోను. కరోనా వ్యవహారాలలో తలమునకలుగా ఉన్నా. ఈ కష్టకాలంలో వ్యక్తిగతంగా ప్రజలకు అండగా ఉండి సేవ చేస్తా. వారికి తోడుగా ఉంటానని హామీ ఇస్తున్నా. నా వెనక జరుగుతున్న పరిణామాలు నా దృష్టికి రాలేదు. ఏమి జరిగిందో కచ్చితంగా తెలియదు. ఈ పరిణామాలపై పూర్తిస్థాయి సమాచారం తెప్పించుకుని, విశ్లేషించుకుని సకాలంలో స్పందిస్తా’’ అని తెలిపారు. మంత్రివర్గం నుంచి మిమ్మల్ని బర్తరఫ్‌ చేస్తారనుకుంటున్నారా? ముందుగా మీరేమైనా నిర్ణయం తీసుకుంటారా అని విలేకరులు ప్రశ్నించగా.. ‘ప్రజలతో చర్చించకుండా ఏమి చెబుతా? వాళ్లు నా బాసులు’ అని అన్నారు. 20 ఏళ్లుగా మచ్చలేని మనిషిగా ఉన్న మీ మీద ఇలాంటి ఆరోపణలు రావటం బాధ కలిగిస్తోందని, మేమందరమూ మీ వెంట ఉంటామని ప్రజలు తనకు భరోసా ఇస్తున్నారని ఈటల చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఇంకా ఏమైనా పరిణామాలు ఉత్పన్నమైతే తన నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తలతో చర్చించుకున్న తర్వాత మాట్లాడతానన్నారు. ‘395 రోజులుగా విరామం లేకుండా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్న నాకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు. వైద్య రంగంలోని అన్ని స్థాయుల వారికి శిరసు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా’ అని అన్నారు.

రోజంతా ఇంట్లోనే ఈటల..
భూకబ్జా ఆరోపణలు, అధికారుల విచారణ సందర్భంగా శనివారం రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్‌ మేడ్చల్‌ మండలం పూడూరులోని తన నివాసానికే పరిమితమయ్యారు. ఉదయం నుంచి రాత్రి దాకా ఇంట్లోనే ఉండి భూసర్వే వివరాలు ఎప్పటికప్పుడు ఆరా తీశారు. అనుచరులతో మంతనాలు సాగిస్తూ.. నివాసానికి చేరుకున్న అందరితో మాట్లాడారు. కరోనా దృష్ట్యా అంతా సంయమనం పాటించాలని.. ఎవరూ రావొద్దని ట్విటర్‌ వేదికగా కార్యకర్తల్ని కోరారు. అయినా వినకుండా చాలామంది హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి తరలివచ్చి సంఘీభావం తెలిపారు. ఉమ్మడి కరీంనగర్‌, యాదాద్రి జిల్లాలతోపాటు హుజూరాబాద్‌ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, వివిధ కుల సంఘాల నేతలు ఆయన్ను కలిసి మద్దతు పలికారు. ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు.

ఇదీ చదవండి: అచ్చంపేటలో అసైన్డ్ భూమి ఉన్నట్లు విచారణలో తేలింది: కలెక్టర్

Last Updated : May 2, 2021, 4:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.