రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ భాజపాలోకి వస్తానని స్పష్టం చేసినట్లైతే దిల్లీకి రావాల్సిన సమయం చెబుతామని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. భాజపా జాతీయ నాయకులతో సమావేశమైన బండి సంజయ్... ఈటల విషయాన్ని అధిష్ఠానానికి వివరించారు. రాష్ట్రంలో ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుందని చెప్పగా.. అలాంటి వారికి అండగా నిలవాలని అధిష్ఠానం సూచించినట్లు తెలుస్తోంది.
వైద్యుల్ని పిలిచి చర్చించే ధైర్యం లేదా?
ముఖ్యమంత్రి కేసీఆర్ సరైన సమయంలో స్పందించి ఉంటే జూడాలు, రెసిడెంట్ వైద్యులు సమ్మె చేసేవారే కాదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ముఖ్యమంత్రికి డాక్టర్లను పిలిచి చర్చలు జరిపే ధైర్యం లేదా అని ప్రశ్నించారు. వైద్య సిబ్బందిపై ఒత్తిడి పడుతుంటే ఖాళీలను ఎందుకు భర్తీ చేయడంలేదని ప్రశ్నించారు. సమ్మెకు సీఎం బాధ్యత వహించి రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు.
కరోనాతో చనిపోయిన ఎంత మంది సిబ్బందికి ఎక్స్‌గ్రేషియో చెల్లించారో సమాధానం చెప్పాలన్నారు. అత్యవసర సేవలకు భంగం కలిగించకుండా వైద్యులు విధులు నిర్వర్తిస్తే వారిపక్షాన నిలబడి భాజపా పోరాడుతుందని సంజయ్ స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: revanth reddy: ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఈడీ