ETV Bharat / state

Telangana BJP Dispute : హై కమాండ్​ నుంచి పిలుపు.. దిల్లీకి కిషన్ రెడ్డి, ఈటల

Eetala And Rajgopal Reddy Meeting With Amit Shah : రాష్ట్రంలో ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ ప్రజల్ని తమ వైపు తిప్పుకునేందుకు నాయకులు వ్యూహాలు మొదలు పెట్టారు. కానీ కొన్నిపార్టీల్లో మాత్రం అంతర్గత విభేదాలు బయటపడుతూ పార్టీలకు నష్టాన్ని చేకూరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీల అధిష్ఠానం వీటిపై దృష్టి పెట్టాయి. తాజాగా బీజేపీలో ఈటల, రాజగోపాల్ రెడ్డి అసంతృప్త గళం వినిపిస్తున్నట్లు తెలుసుకున్న హై కమాండ్ వారిని ఇవాళ దిల్లీకి పిలిచింది. అమిత్ షా, జేపీ నడ్డా.. వీరిద్దరితో భేటీ అయి సర్దిజెప్పే ప్రయత్నం చేయనున్నట్లు సమాచారం. మరోవైపు కిషన్ రెడ్డిని కూడా దిల్లీకి రమ్మని పిలుపు రావడంతో ఆయన హస్తినకు బయల్దేరారు.

bjp
bjp
author img

By

Published : Jun 24, 2023, 10:08 AM IST

Updated : Jun 24, 2023, 11:44 AM IST

బీజేపీ అధిష్ఠానంతో ఈటల, రాజ్​గోపాల్​ రెడ్డి భేటీ

Eetala and Rajgopal Reddy Meet Amith Shah : దక్షిణ భారతంలో తమ ఉనికిని చాటేందుకు బీజేపీ చేయని ప్రయత్నాలు లేవు. కర్ణాటక ఎన్నికలు ముగిసిన తర్వాత ఆ పార్టీ అధిష్ఠానం దృష్టి తెలంగాణ ఎన్నికల వైపు మళ్లింది. బీజేపీపై నమ్మకంతో అధికార పార్టీ నేతలు పార్టీని వీడి కమలం గూటికి చేరారు. కాంగ్రెస్​ నేత కోమటిరెడ్డి రాజ్​గోపాల్​ రెడ్డి కూడా పార్టీ మార్చారు. కమలం పార్టీని వీడిన తర్వాత అధికార పార్టీపై, హస్తంపై విమర్శల వర్షం గుప్పించారు.

Etela and Rajagopal goes to Delhi today : గూటిని మార్చిన మొదట్లో బీజేపీలో జోష్​గానే తిరిగిన నాయకులు ఇప్పుడు కొంత మౌనం పాటిస్తున్నారు. అంతేకాకుండా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికలవేళ ఈ అసంతృప్త గళం మంచిది కాదని భావిస్తున్న బీజేపీ హైకమాండ్ వెంటనే రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలోనే అసంతృప్తిని దూరం చేసే పనిలో పడింది. ఎన్నికల సమయంలో నేతల సమన్వయం లోపం పార్టీకి నష్టాన్ని కలిగిస్తుందని భావిస్తున్న అధిష్ఠానం లోపాన్ని సరిదిద్దే పనిలో బిజీ అయింది.

Lack Of Coordination Between BJP Leaders : రాష్ట్ర బీజేపీలో నెలకొన్న అసంతృప్తిపై పార్టీ అధిష్ఠానం దృష్టిపెట్టింది. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనకుండా ఉంటున్న ఈటల రాజేందర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని దిల్లీ రావాల్సిందిగా ఆదేశించారు. ఈ ఇద్దరు నేతలతో... బీజేపీ అగ్రనేతలు అమిత్‌షా, జేపీ నడ్డా చర్చలు జరుపుతారని తెలుస్తోంది. ఈటల రాజేందర్‌, రాజగోపాల్‌రెడ్డి కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముంగిట నేతల మధ్య సమన్వయ లోపం వల్ల పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని గుర్తించిన అధిష్ఠానం... అసంతృప్తి చల్లార్చే అంశంపై దృష్టి పెట్టింది. ఈటల రాజేందర్‌, రాజగోపాల్‌రెడ్డితో చర్చించేందుకు రెడీ అయింది.

Kishan Reddy Was Called to Delhi : పార్టీలో అంతర్గత వ్యవహారాలు చక్కదిద్దిన తర్వాతే తెలంగాణలో పర్యటించాలని అగ్రనేతలు భావిస్తున్నారు. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కూడా దిల్లీకి రమ్మని పిలవడంతో ఆయన హైదరాబాద్ నుంచి హస్తినకు బయల్దేరారు. ఇవాళ నగరంలో తాను పాల్గొనాల్సిన కార్యక్రమాలను కిషన్ రెడ్డి రద్దు చేసుకున్నారు. అమిత్ షా, జేపీ నడ్డాలతో ఈటల, రాజగోపాల్ రెడ్డి భేటీలో కిషన్ రెడ్డి కూడా పాల్గొననున్నట్లు సమాచారం.

Bandi Sanjay Statement About Party Leaders : పార్టీలోని ముఖ్యనేతలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విడివిడిగా సమావేశమై...తాజా పరిస్థితులపై చర్చించారు. బీఆర్​స్​ను ఎదుర్కొనే వ్యూహాలపై చర్చించారు. పార్టీలో నెలకొన్న స్తబ్ధతపై సీనియర్‌ నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గ్రూపు రాజకీయాల వల్ల నష్టం జరుగుతోందని చెప్పినట్లు సమాచారం. పార్టీని వీడాలనుకునే వారిని ఆపవద్దని కోరినట్లు తెలుస్తోంది.

బీజేపీ నుంచి ఎవరూ వేరే పార్టీలోకి వెళ్లరని రాష్ట్ర కమలదళ సారథి బండి సంజయ్‌ విశ్వాసం వ్యక్తంచేశారు. విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన... రాజగోపాల్‌రెడ్డికి ఫోన్‌ చేసి మాట్లాడినట్లు చెప్పారు. ఎవరైనా పార్టీ నుంచి వెళ్లినా.. వారిని ఆపబోమని బండి సంజయ్‌ స్పష్టంచేశారు. పార్టీలో చేరికలపై ఆషాఢమాసం ప్రభావం ఉంటుందన్నారు. రేపు నాగర్‌కర్నూలులో జరిగే జేపీ నడ్డా పర్యటనను విజయవంతం చేయడంపై దృష్టి సారించినట్లు బండి సంజయ్‌ తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 24, 2023, 11:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.