ప్రైవేట్ పాఠశాలలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫీజులను పెంచొద్దని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఏ రూపంలో అధిక రుసుములు వసూలు చేసినా... కఠిన చర్యలు తీసుకోవాలని, గుర్తింపు రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇవాళ సమీక్ష నిర్వహించారు.
లాక్ డౌన్ కారణంగా తల్లిదండ్రులు ఆదాయం కోల్పోయినందున.. యాజమాన్యాలు మానవత దృక్పథంతో వ్యవహరించాలని సబితా ఇంద్రారెడ్డి కోరారు. ఫీజులను ఒకేసారి చెల్లించేలా ఒత్తిడి చేయవద్దని.. నెల వారీగా తీసుకునేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు. రేపటి నుంచి ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు టీ శాట్ ద్వార్ డిజిటల్ పాఠాలు బోధన జరుగుతుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రోజుకో సబ్జెక్టు పాఠశాలలను ప్రసారం అవుతాయని పేర్కొన్నారు. టీశాట్ యాప్లో 513 పాఠాలు అందుబాటులో ఉన్నాయని.. అదేవిధంగా www.scert.telangana.gov.in వెబ్ సైట్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు ఈ - పాఠ్యపుస్తకాలను పొందుపరిచినట్లు సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
ఇదీ చూడండి: పోలీసులను చూసి భయమేసింది... కొత్తిమీర రోడ్డు పాలైంది