పాఠశాలల్లో ఖాళీలను తొందరలోనే భర్తీ చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. పాఠశాలల్లో శౌచాలయాలు, స్కూలును శుభ్రం చేయడం కోసం ప్రత్యేకంగా అటెండర్‌లను ఏర్పాటు చేస్తామని శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. అవసరమైన పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయుల భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
పాఠశాలల్లో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. అన్ని పాఠశాలలకు మిషన్ భగీరథ నీటిని అందిస్తున్నామని వెల్లడించారు. అవసరమైన పాఠశాలల్లో మరిన్నీ టాయిలెట్లు నిర్మిస్తామని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: పోరు దిశగా కాంగ్రెస్... నిలువరించే పనిలో తెరాస