ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది రూ.2 వేల కోట్లతో మౌలిక వసతులు కల్పించేందుకు మండలం యూనిట్‌గా బడులను ఎంపిక చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రతి మండలంలో 30-35 శాతం బడులను ఎంపిక చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ఇందుకోసం మండలంలో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న పాఠశాలలను కొలమానంగా తీసుకుంటారు. తాజాగా ఈ పథకం అమలుకు విధి విధానాల రూపకల్పనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులతో సమీక్షించారు. వీటిపై త్వరలో ఉప సంఘం చర్చించి తుది నిర్ణయం కోసం సీఎం ఆమోదానికి పంపించనున్నారు.
ఇదీ చదవండి: నేటి నుంచి ప్రైవేట్ ఉపాధ్యాయులు, సిబ్బందికి ఆర్థిక సాయం