ETV Bharat / offbeat

అమ్మలూ.. పిల్లల పాత సాక్సుల్ని పడేస్తున్నారా ? - ఒకసారి ఇలా ఉపయోగించి చూడండి! - TIPS TO REUSE OLD SOCKS

- ఇలా కొత్తగా ఆలోచిస్తే.. ఇంట్లో ఏదీ వృథా కాదు!

Ways To Reuse Old Socks
Ways To Reuse Old Socks (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 26, 2024, 1:00 PM IST

Best Ways To Reuse Old Socks : పాదాలు వెచ్చగా ఉండడం కోసం.. అలాగే హాని కలగకూడదని రోజూ రంగురంగుల సాక్సులను పిల్లలకు వేస్తుంటారు తల్లిదండ్రులు. కానీ, వారు ఎదిగే కొద్దీ అవి ఉపయోగపడకపోవచ్చు. ఎన్నో డబ్బులు పోసి కొన్నవాటిని పారేయడానికి మనసు రాదు. అలాంటప్పుడు కొన్ని టిప్స్​ పాటిస్తే వాటిని ఎంచక్కా సద్వినియోగం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఆ చిట్కాలు మీ కోసం..

  • వంట చేసే పాత్రలకు ఉండే హ్యాండిల్స్‌ త్వరగా వేడెక్కుతుంటాయి. కాబట్టి, ఈసారి వాటికి ఇంట్లోని సాక్స్‌ని చుట్టేయండి. దీంతో పట్టుకోవడం తేలిక అవుతుంది. అలాగే చెయ్యి కూడా కాలకుండా ఉంటుందని అంటున్నారు.
  • జర్నీ చేసేటప్పుడు నగలు వంటివాటిని నేరుగా పెట్టెలోనో, బ్యాగులోనో పెట్టేయకుండా సాక్సుల్లో ఉంచి సర్దండి. దీనివల్ల విరిగిపోకుండా ఉంటాయి. అవనే కాదు ఖరీదైన క్రిస్టల్‌ వస్తువులూ, గ్లాసులూ వంటి వాటిని దాచిపెట్టేటప్పుడు సాక్సుల్లో ఉంచితే వాటి అంచులు విరిగిపోకుండా జాగ్రత్త పడవచ్చంటున్నారు.
  • ఇంట్లో డైనింగ్​ టేబుల్​, బీరువాలు వంటి ఫర్నిచర్‌ని ఒక చోటు నుంచి మరొకచోటుకి కదిలించేముందు వాటి కాళ్లకు సాక్సులు తొడిగితే నేలపై గీతలు పడకుండా చూసుకోవచ్చని వివరిస్తున్నారు.
  • షూలను పాలిష్ చేయడానికి కూడా పాత సాక్సులను వాడుకోవచ్చు. పాలిష్ చేసిన తర్వాత సాక్సుతో ఒకసారి రుద్దితే షూస్ తళతళా మెరిసిపోతాయి.
  • చిన్న చిన్న వస్తువులను సాక్సుల్లో భద్రపర్చుకోవడం వల్ల అవి ఎక్కడో పడిపోతాయన్న భయం ఉండదు.
  • ఆకర్షణీయమైన రంగుల్లో ఉన్న సాక్సు కట్ చేసి అందులో గుండ్రని రాయి ఉంచి కుట్టేస్తే అందమైన పేపర్ వెయిట్ తయారైపోతుంది.
  • చాలా మంది ఇంట్లో బ్యాడ్​స్మెల్​ పోగొట్టేందుకు పాట్‌పౌరీని వాడుతుంటాం. వాటిని గాజు పాత్రల్లోనే కాదు.. ఇలా వాడని సాక్సుల్లో వేసి ఇంట్లోని మూలల్లో పెట్టేయొచ్చు. దుస్తుల బీరువాలో నాఫ్తలీన్‌ గోళీలనూ నేరుగా వేయకుండా సాక్సుల్లో ఉంచితే సరిపోతుంది. దీంతో మరకలు పడకుండా ఉంటాయి.
  • కొన్ని రకాల కొత్త వస్తువులు కొన్నప్పుడు సిలికా బ్యాగులు వస్తాయి. వాటన్నింటినీ ఒక సాక్సులో వేసి మూటకట్టి కిటికీ దగ్గర వేలాడదీయండి. ఇవి ఇంట్లోకి ఎక్కువ తేమను రానీయకుండా కొంతవరకు అడ్డుకుంటాయి.
  • సాక్సుల్లో కొద్దిగా దూదిని నింపి చిన్న గలేబుల(దిండు) మాదిరిగా తయారుచేయండి. కంప్యూటర్‌ కీబోర్డుని వాడుతున్నప్పుడు చేతి మణికట్టు ఆనే చోట.. వీటిని ఉంచితే అక్కడ మచ్చలు పడకుండా ఉంటాయట
  • చాలామంది ఇంటిని వీలున్నప్పుడల్లా తడిగుడ్డ పెట్టి తుడుస్తుంటారు. అలాగే, కిటికీ అద్దాల పైన పడిన మరకలను తడిగుడ్డతోనే తుడుస్తారు. ఇలా కాకుండా కిటికీలను సాక్సులతో శుభ్రం చేసుకోవచ్చు. ఒకవేళ కిటికీ పైభాగం మీకు అందకపోయినా సాక్సును కర్రకు తగిలించి, తుడుచుకోవచ్చు.
  • అలాగే సాక్సులతో పిల్లలకు రకరకాల బొమ్మలు తయారుచేసి ఇవ్వచ్చు. చిన్న బొమ్మలకు దుస్తులు కూడా కుట్టచ్చు.

ఇవి కూడా చదవండి :

కూరగాయల తొక్క తీసుకోవడమే కాదు - ఇంట్లోనే కత్తులను పదును పెట్టుకోవచ్చు - ఈ కిచెన్​ టూల్స్​ చూశారా?

ఇంట్లో పిల్లల కోసం ఈ చిన్న ఫర్నిచర్ ఉంటే - తరచూ ఇల్లు ఖాళీ చేయాల్సిన పనిలేదు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.