ETV Bharat / state

Education Day Celebrations : ఘనంగా విద్యా దినోత్సవం... పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు

Education Day Celebrations in Telangana : రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యాదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మన ఊరు... మన బడి పాఠశాలలతో పాటు గ్రంథాలయాలు, డిజిటల్ తరగతి గదులను మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. విద్యార్థులకు యునిఫాంలు, పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్‌లు పంపిణీ చేసి... తొమ్మిదేళ్లలో విద్యారంగంలో సాధించిన విజయాలను వివరించారు.

Education Day Celebrations
Education Day Celebrations
author img

By

Published : Jun 20, 2023, 9:04 PM IST

రాష్ట్రావిర్భావ దశాబ్ది వేడుకల్లో భాగంగా విద్యా దినోత్సవం

Telangana Education Day 2023 : రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యాదినోత్సవం నిర్వహించారు. 9ఏళ్లలో భారాస సర్కార్‌ పాలనలో వచ్చిన మార్పుల్ని వివరించేలా వివిధ కార్యక్రమాలు చేపట్టారు. రవీంద్రభారతిలో ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన వేడుకలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్‌ అలీ, శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ సర్కార్‌ చర్యలతో ప్రభుత్వ విద్యలో అనేక మార్పులు వచ్చాయని మంత్రులు అన్నారు.

Minister Harishrao Latest Comments : సిద్దిపేటలో విద్యా దినోత్సవంలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు... పదో తరగతి ప్రతిభావంతులను సన్మానించారు. జిల్లాలో 219 పాఠశాలల్లో వందశాతం ఫలితాలు వచ్చాయన్న ఆయన... 126మంది విద్యార్థులు పదికి పది జీపీఏ సాధించారన్నారు. ప్రతిభావంతులకు డిజిటల్ కంటెంట్‌ ఉన్న ఐ ప్యాడ్ అందిస్తున్నామని హరీశ్​రావు తెలిపారు. 100 శాతం ఫలితం వచ్చిన 8మండలాలకు రూ.50వేల చెక్కు ఇస్తున్నామన్న హరీశ్​... అభివృద్ధిలోనే కాదు విద్యలోనూ సిద్దిపేట ముందుందని పేర్కొన్నారు. నో అడ్మిషన్ బోర్డు పెట్టేస్థాయికి ప్రభుత్వ పాఠశాలలు వచ్చాయన్నారు. 2014లో 5మెడికల్ కాలేజీలు ఉంటే నేడు 21కి చేరాయని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.

Education Day Celebrations In Telangana : మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని ఆధునికీకరించిన జిల్లెలగూడ జిల్లా పరిషత్ పాఠశాలను మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రారంభించారు. మేడ్చల్‌ జిల్లా గుండ్లపోచంపల్లిలో మంత్రి మల్లారెడ్డి డిజిటల్ క్లాస్‌రూమ్‌లలో తరగతులకు శ్రీకారం చుట్టారు. కోకాపేట్‌లో 2 కోట్ల రూపాయలతో 'ప్రెస్టేజ్ గ్రూప్' సహకారంతో నిర్మించిన అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ ప్రారంభించారు. హస్మత్ పేట్ ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, హైదర్‌గూడ, కింగ్‌కోఠిల్లో ఎమ్మెల్యే దానం నాగేందర్‌ మన ఊరు- మనబడి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 9ఏళ్లలో ప్రభుత్వ విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని నల్గొండలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు.

మెదక్ జిల్లా రామాయంపేటలో వివిధ సౌకర్యాలతో ఆధునికీకరించిన ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి ప్రారంభించారు. నిజామాబాద్‌లో ఆధునికీకరించిన 3 ప్రాథమిక పాఠశాలలను ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా ప్రారంభించారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం మేడిపల్లిలో ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు విద్యార్థులకు పాఠ్య పుస్తకాల్ని పంపిణీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో పాఠశాల సముదాయ భవనాల్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌... 9ఏళ్లలో విద్యారంగంలో జరిగిన ప్రగతిని వివరించారు.

వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌, భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విద్యాదినోత్సవంలో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో ఎ‌మ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో ఎమ్మెల్యే హరిప్రియానాయక్‌ ఆధునికీకరించిన పాఠశాల భవనాల్ని ప్రారంభించారు. నిర్మల్‌లో జరిగిన విద్యాదినోత్సవంలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి... ప్రభుత్వ విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. హన్మకొండ జిల్లా కమలాపూర్‌ మండలం మర్రిపెల్లిలో విద్యార్థులు ర్యాలీ చేస్తుండగా... రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతిచెందడం తీవ్ర విషాదం నింపింది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.