ETV Bharat / state

రూ.278 కోట్ల ఈ బిజ్​ కంపెనీ ఆస్తులు జప్తు

ఈ బిజ్​ కంపెనీ ఆస్తులను ఈడీ ప్రాథమికంగా జప్తు చేసింది. సంస్థ డైరెక్టర్లు, వారి కుటుంబ సభ్యుల పేరిట ఉన్న సుమారు రూ.278 కోట్ల ఆస్తులను అటాచ్​ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా 124 బ్యాంకుల్లో రూ.242 కోట్లు ఉన్నట్లు ఈడీ గుర్తించింది.

author img

By

Published : Sep 18, 2019, 10:18 AM IST

ఈ బిజ్
రూ.278 కోట్ల ఈ బిజ్​ కంపెనీ ఆస్తులు జప్తు
మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలకు పాల్పడిన ఈ బిజ్ కంపెనీ ఆస్తులను ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​ ప్రాథమికంగా జప్తు చేసింది. ఈ బిజ్ డాట్ కంపెనీతో పాటు... సంస్థ డైరెక్టర్లు పవన్ మల్హన్, అనిత మల్హన్, వారి కుటుంబ సభ్యుల పేరిట ఉన్న సుమారు రూ.278 కోట్ల ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ ఉత్తర్వులు జారీ చేసింది. సులభంగా డబ్బులు సంపాదించవచ్చని ఆశచూపి.. సుమారు 12 లక్షల మంది నుంచి రూ. 1,064 కోట్లు ఈ బిజ్ కంపెనీ వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది.

124 బ్యాంకుల్లో రూ.242 కోట్లు:

ఈ బిజ్ వ్యవస్థాపకుడు పవన్ మల్హన్, ఆయన కుమారుడు హితిక్ మల్హన్​ను ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. సైబరాబాద్ పోలీసుల కేసు ఆధారంగా మనీలాండరింగ్ చట్టం కింద విచారణ జరిపిన ఈడీ.. దిల్లీ, నోయిడాలోని భూములు, ఫ్లాట్లు, భవనాలు తదితర 29 స్థిరాస్తులతో పాటు... దేశవ్యాప్తంగా 124 బ్యాంకు ఖాతాల్లో రూ.242 కోట్లు ఉన్నట్లు గుర్తించింది. ఆ ఆస్తులన్నింటినీ ఈజీ ప్రాథమికంగా జప్తు చేసిన ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది.

ఇవీ చూడండి: కేసీఆర్ సారూ.. మా గ్రామాలను తెలంగాణలో కలుపుకోండి.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.