బీమా వైద్య సేవల మందుల కొనుగోలు కుంభకోణం కేసు విచారణకు ప్రత్యేక కోర్టు అవసరమని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ భావిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదించేందుకు సిద్ధమవుతోంది. ఐఎంఎస్ మందుల కొనుగోలు కుంభకోణంలో మరో నెల రోజుల్లో ఏసీబీ అధికారులు అభియోగపత్రం దాఖలు చేయాలని భావిస్తున్నారు.
అతిపెద్ద కేసు..
ఈ కేసులో సెప్టెంబరు 25న ఏడుగురిని అరెస్ట్ చేశారు. నాటి నుంచి 90 రోజుల్లో అభియోగ పత్రం దాఖలు చేయకుంటే నిందితులకు బెయిల్ పొందే వెసులుబాటు వస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని డిసెంబరు 25లోపు మొదటి అభియోగపత్రం దాఖలు చేయాలని భావిస్తున్నారు. పెద్ద సంఖ్యలో దస్త్రాలతో ముడిపడిన కేసు కాబట్టి దర్యాప్తులో బయటపడుతున్న అంశాల ఆధారంగా అనుబంధ అభియోగ పత్రాలు దాఖలు చేయనున్నారు. అవినీతి నిరోధ శాఖ చరిత్రలోనే ఇది అతి పెద్ద కేసుగా చెబుతున్నారు.
ఇవీ చూడండి: ప్రేయసి కోసం అమ్మ నగలు, నగదు దొంగతనం