ETV Bharat / state

శాసనసభ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం - తెలంగాణ ఎన్నికల నామినేషన్ రేపటినుంచి ప్రారంభం

EC Terms On Election Notification in Telangana : తెలంగాణ శాసనసభ ఎన్నికలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల నోటిఫికేషన్​తో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి. ఇందులో భాగంగా నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. వారంపాటు నామపత్రాలు స్వీకరించనున్నారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనూ.. నామినేషన్లను సిద్ధం చేసుకోవచ్చన్న ఎన్నికల సంఘం.. నామినేషన్ల దాఖలు సమయంలో నిబంధనలు, అఫిడవిట్ల విషయంలో ఖచ్చితంగా మార్గదర్శకాలు పాటించాలని స్పష్టం చేసింది.

Election Notification in Telangana
EC Terms On Election Notification in Telangana
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 2, 2023, 8:34 PM IST

Updated : Nov 3, 2023, 11:04 AM IST

EC Terms On Election Notification in Telangana : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఉదయం 11 గంటలకు అధికారులు ఫార్మ్‌-1 నోటీసు జారీ చేశారు. అనంతరం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈనెల 10 వరకు అభ్యర్థులు ప్రతి రోజూ ఉదయం 11 నుంచి.. మధ్యాహ్నం 3వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. ఈనెల13న నామపత్రాల పరిశీలన చేపట్టనండగా.. ఈనెల 15 వరకు ఉపసంహరణకు చివరి తేదీగా నిర్ణయించారు. ఈనెల 30న పొలింగ్‌ నిర్వహించి వచ్చేనెల 3న ఓట్లలెక్కింపు చేపడతారు. డిసెంబర్ 5లోపు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది.

Supreme Court lawyers on TS Elections : శాసనసభ ఎన్నికల నిర్వహణపై సీఈసీకి.. సుప్రీం న్యాయవాదుల విజ్ఞాపనలు

నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని ఈసీ స్పష్టం చేసింది. ఒక్కో అభ్యర్థి ఒక్కో నియోజకవర్గం నుంచి గరిష్ఠంగా నాలుగుసెట్ల నామినేషన్లు వేయవచ్చు. ఒక అభ్యర్థి రెండుకు మించి నియోజకవర్గాల్లో పోటీ చేయరాదు. నామినేషన్ల దాఖలులో.. ఆర్​వో, ఏఆర్​వో కార్యాలయం సమీపంలోని వంద మీటర్ల పరిధిలోకి గరిష్ఠంగా మూడు వాహనాలనే అనుమతిస్తారు. నామినేషన్ ప్రక్రియ, కార్యాలయం వెలుపల వీడియో, సీసీటీవీ ద్వారా రికార్డు చేస్తారు.

Elections Nominations Start in Telangana : అభ్యర్థులు నామినేషన్లను ఆన్‌లైన్‌లోనూ సమర్పించవచ్చని అధికారులు.. ఈసీ అందుబాటులోకి తీసుకొచ్చిన సువిధ పోర్టల్ ద్వారా ఆ సదుపాయం ఉందని చెప్పారు. ఆన్‌లైన్‌లో నామినేషన్ సమర్పించినా అభ్యర్థి ఆప్రతిపై సంతకంచేసి నిర్ధిష్ట గడువులోగా రిటర్నింగ్ అధికారికి అందించాల్సి ఉంటుంది. విదేశీ ఓటర్లు అక్కడి నుంచే నామినేషన్ దాఖలు చేస్తే అక్కడి రాయబార కార్యాలయాలు, కాన్సుల్ కార్యాలయాల్లో ప్రమాణం చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

అభ్యర్థులు నామినేషన్‌తో పాటు.. అఫిడవిట్ దాఖలు చేసి ప్రమాణం చేయాల్సి ఉంటుంది. ఏ ఫారం, బీ ఫారాలను నామినేషన్ల దాఖలుకు.. చివరిరోజు 3 గంటల్లోపు విధిగా ఇవ్వాలని వివరించారు. ఎన్నికల వ్యయం కోసం ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరిచి ఆ వివరాలను నామినేషన్‌తో పాటు సమర్పించాలని తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ అభ్యర్థి అయితే ఒకరు ప్రతిపాదించాల్సి ఉంటుంది.

TS Elections Nominations From November 3rd : ఇతరులకు 10 మంది ప్రతిపాదించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతిపాదకులంతా అదే నియోజకవర్గానికి చెందినవారై ఉండాలి. నామినేషన్‌తోపాటు.. అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ పత్రాలన్నీ రిటర్నింగ్ అధికారి నోటీసు బోర్డుపై ఉంచాలి. అభ్యర్థుల అఫిడవిట్‌లను.. 24 గంటల్లోపు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అఫిడవిట్‌లో ఏవైనా ఖాళీలుంటే.. ఆర్వో సదరు అభ్యర్థులకు నోటీస్‌ జారీచేయాల్సి ఉంటుంది. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసినట్లైతే దాన్ని వెబ్‌సైట్‌లో పొందుపర్చాలి. నామినేషన్ల దాఖలు సమయం నుంచే అభ్యర్థులు చేసే ఖర్చు ఎన్నికల వ్యయం పరిధిలోకి వస్తుంది. అప్పట్నుంచి అన్ని వివరాలు అభ్యర్థి నమోదు చేసి అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది.

శుక్రవారం నుంచి ఎన్నికల వ్యయ పరిశీలకులు క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగనున్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు గాను 60 మంది ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఐఆర్​ఎస్,ఐఆర్​ఎస్​ఎలను పరిశీలకులుగా నియమించగా శుక్రవారం నుంచి విధుల్లో ఉంటారు. వారికి సహాయకంగా ఇతర అధికారులు, సిబ్బంది ఉంటారు. అభ్యర్థులు చేసే ఖర్చుపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టడంతో పాటు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తారు. 39 మంది ఐపీఎస్ అధికారులను పోలీసు పరిశీలకులుగా నియమించారు. కేటాయించిన నియోజకవర్గాల్లో శాంతిభద్రతల నిర్వహణ, సంబంధిత అంశాలను వారు పర్యవేక్షిస్తారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఉనికి చాటుకునేందుకు శ్రమిస్తున్న చిన్న పార్టీలు

TS Assembly Elections 2023 : అసెంబ్లీ ఎన్నికల్లో టీ-కాంగ్రెస్‌ వ్యూహం ఇదే.. ఫలించేనా..?

Last Updated : Nov 3, 2023, 11:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.