EC Orders to Grant Leave For Institutions : తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ రోజున.. రాష్ట్రంలో ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలు విధిగా సెలవు ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఉద్యోగులు(Employees) ఓటు హక్కును వినియోగించుకునేలా సంస్థలు సెలవు ఇవ్వాలని ఆదేశించారు. గత ఎన్నికల వేళ కొన్ని సంస్థలు సెలవు మంజూరు చేయలేదని.. పలుచోట్ల నుంచి ఫిర్యాదులు వచ్చాయని సీఈవో తెలిపారు.
ప్రలోభాలకు తావులేకుండా విసృత తనిఖీలు - 24 గంటలు నిఘా : సీఈవో వికాస్ రాజ్
2018 అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల వేళ సెలవు ఇవ్వనట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ మేరకు ఇప్పుడు జరగనున్న ఎన్నికలకు అన్ని సంస్థలు సెలవు ఇచ్చాయో.. లేదో పరిశీలించాలని కార్మిక శాఖకు(Labor Department) వికాస్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు. సెలవు ఇవ్వని సంస్థలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సీఈవో ఆదేశించారు.
2 Days Holidays for Educational Institutions..: రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో బుధ, గురువారాల్లో విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటన ఇచ్చింది. ఈ మేరకు రాజధానిలో జిల్లా కలెక్టర్ అనుదీప్ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఒకే విడతలో ఎన్నికల పోలింగ్ జరగనుంది. నియోజకవర్గాల్లోని పలు విద్యాసంస్థల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బుధవారం ఆయా పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రిని సైతం తరలించనున్నారు. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవు ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
Election Poling Stations in Telangana : రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు సీఈవో వికాశ్ రాజ్ వెల్లడించారు. ఇందుకుగాను మొత్తం 3,803 సెక్టార్లలో ఈ పోలింగ్ కేంద్రాలు నిర్వహించినట్లు తెలిపారు. ఓటరు తప్పనిసరిగా పోలింగ్ కేంద్రానికి ఏదైనా గుర్తింపు కార్డు తీసుకెళ్లాలని సూచించారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రంలోకి సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు వంటివి తీసుకెళ్లటం నిషేధమని తెలిపారు.
AP CEO Mukesh Kumar Meena on Telangana Elections : తెలంగాణా ఓటర్లుగా ఉండి ఏపీలోని సరిహద్దు జిల్లాల్లో పనిచేస్తున్న వ్యక్తులకు ఆర్జిత సెలవు మంజూరు ప్రకటించాల్సిందిగా జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. నవంబరు 30 తేదీన తెలంగాణాలో పోలింగ్ సందర్భంగా ఓటర్లుగా నమోదైన ఉద్యోగులకు పెయిడ్ హాలిడేను ఇవ్వాల్సిందిగా సూచిస్తూ ఆదేశాలు ఇచ్చారు.
తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారపర్వం - రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి
ఏలూరు, ఎన్టీఆర్, పలనాడు, కర్నూలు, నంద్యాల, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పనిచేస్తున్న తెలంగాణా ఓటర్లకు సెలవును మంజూరు చేయాల్సిందిగా సూచించారు. ప్రజాప్రతినిధుల చట్టం సెక్షన్ 135 బీ ప్రకారం వాణిజ్యం, వ్యాపారం, పరిశ్రమల్లో పనిచేస్తున్న ఏ వ్యక్తులైనా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులని అందుకోసం సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.