దేశంలో తెలంగాణ తరహా పాలన తీసుకుచ్చేందుకు తెలంగాణ రాష్డ్ర సమితిని... భారత్ రాష్ట్ర సమితిగా మార్చేందుకు కేసీఆర్ చేపట్టిన ప్రయత్నాల్లో తొలి అడుగు పడింది. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా గుర్తిస్తున్నట్లు కేంద్రం ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ మేరకు బీఆర్‌ఎస్ పేరు మార్పుపై ఈసీ నుంచి కేసీఆర్‌కు అధికారికంగా లేఖ అందింది. అక్టోబర్ 5న దసరా రోజున పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం మేరకు తెరాసను భారాసగా మారుస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈసీ లేఖకు స్పందనగా ఎన్నికల సంఘానికి గులాబీదళపతి కేసీఆర్ లేఖ పంపనున్నారు.
రేపు మధ్యాహ్నం బీఆర్‌ఎస్ ఆవిర్భావ కార్యక్రమం : రేపు తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాలకు బీఆర్‌ఎస్ ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. అనంతరం బీఆర్‌ఎస్ జెండాను ఆవిష్కరించనున్నారు. ఆ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో పాల్గొనాలని పార్టీ నేతలను ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. బీఆర్‌ఎస్‌గా పేరుమార్పు ప్రక్రియ పూర్తికావడంపై తదుపరి కార్యాచరణపై గులాబీదళపతి నిర్ణయం తీసుకోనున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అధికారికంగా లేఖ రావడంతో దిల్లీ నుంచి టీఆర్‌ఎస్ ఎంపీలు హైదారాబాద్ బయలుదేరారు. వెంటనే రావాలని సీఎంవో నుంచి ఆదేశాలు రావడంతో టీఆర్‌ఎస్ ఎంపీలు కేశవరావు, నామా, మన్నె శ్రీనివాసరెడ్డి నగరానికి పయనమయ్యారు.
ఇవీ చదవండి: