భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన నెల్లూరులోని శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి గురువారం పీఎస్‌ఎల్‌వీ-సి50 వాహకనౌక ద్వారా పంపిన సీఎంఎస్-01 కమ్యూనికేషన్ ఉపగ్రహానికి కాకినాడకు చెందిన కేవీఎస్ భాస్కర్ సంచాలకుడిగా వ్యవహరించారు. ఆయన సారథ్యంలోనే ఈ ఉపగ్రహ రూపకల్పన జరిగింది. ఈ ఉపగ్రహాన్ని జియో స్టేషనరీ ఆర్బిట్‌లో శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టారు.
ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ చేసిన కేవీఎస్ భాస్కర్ బెంగళూరులోని ఇస్రో కేంద్రంలో ఉద్యోగంలో చేరారు. ప్రస్తుతం యూఆర్ రావు శాటిలైట్ సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి : 'లాక్డౌన్లో 45శాతం పెరిగిన వాచ్టైం'