ETV Bharat / state

ఎంసెట్, ఈసెట్ షెడ్యూల్ విడుదల... నిమిషం ఆలస్యం యథాతథం

author img

By

Published : Feb 16, 2020, 9:23 AM IST

ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ ఈనెల 21న ప్రారంభం కానుంది. మే 4 నుంచి జరగనున్న ఎంసెట్​ను తెలంగాణలో 51.. ఏపీలో నాలుగు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఎస్సీ, ఎస్టీలతో పాటు.. దివ్యాంగులకు ఈ ఏడాది నుంచి పరీక్ష రుసుములో యాభై శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. ఈడబ్ల్యూఎస్ కోటాకు ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రాకపోయినప్పటికీ.. దరఖాస్తుల్లో ఆప్షన్ ఇవ్వనున్నట్లు ఉన్నత విద్యా మండలి తెలిపింది. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి నిరాకరించే నిబంధన యథాతథంగా కొనసాగుతుందని వెల్లడించింది.

eamcet-ecet-exam-schedule-release-in-telangana
ఎంసెట్, ఈసెట్ షెడ్యూల్ విడుదల... నిమిషం ఆలస్యం యథాతథం

తెలంగాణలో ఎంసెట్‌, ఈసెట్‌ షెడ్యూల్‌ విడుదలైంది. ఈనెల 19న ఎంసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది. ఈనెల 21 నుంచి మార్చి 30 వరకు.. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరిస్తారు. ఏప్రిల్‌ 27 వరకూ పదివేల ఆలస్య రుసుముతో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 3 వరకు దరఖాస్తులో సవరణలకు అవకాశం ఇవ్వనున్నారు. ఏప్రిల్‌ 20 నుంచి మే 1 వరకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మే 4, 5, 7 తేదీల్లో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్ష, మే 9,11 తేదీల్లో వ్యవసాయం, వైద్య పరీక్ష నిర్వహించనున్నారు.

తెలంగాణలో 51, ఏపీలో 4...

తెలంగాణలో 51, ఆంధ్రప్రదేశ్​లో నాలుగు పరీక్ష కేంద్రాల్లో ఎంసెట్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్​లో విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, తిరుపతిలో పరీక్ష కేంద్రాలు ఉంటాయి. ఈ ఏడాది ఎస్సీ, ఎస్టీలతో పాటు దివ్యాంగులకు కూడా పరీక్ష రుసుములో రాయితీ ఇవ్వాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ఎంసెట్​కు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 400 రూపాయలు... బీసీ, ఓసీలు 800 రూపాయలు చెల్లించాలి.

నిమిషం నిబంధనలో మార్పు లేదు

ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి నిరాకరించే నిబంధనలో ఎలాంటి మార్పు లేదని.. కచ్చితంగా అమలు చేస్తామని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి స్పష్టం చేశారు. ఈడబ్ల్యూఎస్ కోటా అమలు కోసం ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు అనుమతి రాలేదని.. అయితే ముందు జాగ్రత్తగా దరఖాస్తులో మాత్రం ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ ఇస్తున్నట్లు తెలిపారు.

మే 2న ఈసెట్ పరీక్ష

పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ గణితం డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో చేరేందుకు నిర్వహించనున్న ఈసెట్​కు.. దరఖాస్తుల ప్రక్రియ ఈనెల 24న ప్రారంభం కానుంది. ఈనెల 24 నుంచి మార్చి 26 వరకు ఆన్​లైన్​లో ఈసెట్ దరఖాస్తులు స్వీకరిస్తారు. 10వేల ఆలస్య రుసుంతో ఏప్రిల్‌ 28 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఈసెట్ కన్వీనర్ ఎం.మంజూర్ హుస్సేన్ తెలిపారు. మే 2వ తేదీన రెండు పూటలు పరీక్ష జరగనుంది.

జేఎన్​టీయూహెచ్ అనుబంధ కాలేజీల అనుమతుల ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 15 కాలేజీలు మూసివేతకు దరఖాస్తు చేసుకున్నట్లు జేఎన్​టీయూహెచ్ రిజిస్ట్రార్ గోవర్దన్ తెలిపారు.

ఎంసెట్‌ షెడ్యూల్‌ క్లూప్తంగా....

నోటిఫికేషన్‌ ఫిబ్రవరి 19
ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఫిబ్రవరి 21- మార్చి 30
దరఖాస్తు సవరణలు మార్చి 31- ఏప్రిల్‌ 03
హాల్‌టికెట్లు ఏప్రిల్‌ 20-మే 01
ఇంజినీరింగ్‌ పరీక్ష మే 4, 5, 7
వ్యవసాయం,వైద్య పరీక్షమే 9, 11

ఈసెట్‌ షెడ్యూల్‌ క్లూప్తంగా....

నోటిఫికేషన్‌ ఫిబ్రవరి 24
ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఫిబ్రవరి 24- మార్చి 26
దరఖాస్తు సవరణలు 10వేల ఆలస్య రుసుంతో ఏప్రిల్‌ 28
పరీక్ష మే 2

ఇదీ చూడండి: 'సహకార' ఎన్నికలు ప్రశాంతం.. ఫలితాల విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.