కరోనా వైరస్ నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు అనుగుణంగా ప్రజలు నడుచుకోవాలని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ సూచించారు. ప్రజలు కిరాణా షాపుల వద్ద సామాజిక దూరం పాటించడం లేదని సీపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకేసారి ఐదుగురుకి మించి బయట తిరగొద్దని సూచించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
స్వీయ నిర్బంధమే భేష్...
ఇప్పటికే పలు కేసులు నమోదు చేశామని సీపీ తెలిపారు. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలంటే ఈ నెల 31 వరకు ప్రజలంతా స్వీయ నిర్బంధంలో ఉండాలని స్పష్టం చేశారు. సాయంత్రం 6 నుంచి ఉదయం 7 గంటల వరకు ఎవరూ బయట తిరగవద్దని అన్నారు. పార్కులు, పబ్‌లు, పర్యటక కేంద్రాలు, రవాణా వ్యవస్థ, క్యాబ్‌లు తదితర అన్ని మూసివేశామని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితిల్లో తప్ప ఎవరూ ఇళ్లు విడిచి బయటకు రావొద్దన్నారు.