హైదరాబాద్‌లోని ఖైరతాబాద్, సికింద్రాబాద్, మలక్ పేట్, బండ్లగూడ రవాణశాఖ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ నెంబర్ల ఈ-బిడ్డింగ్‌ను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. మొదటి రోజు రెండు నెంబర్లకు వాహనదారులు బిడ్డింగ్ దాఖలు చేశారు. తమ నెంబర్ రిజర్వేషన్ చేయాలనుకునే వాహనదారులు ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు బిడ్ ధరను ఆన్లైన్లో చెల్లించాలి. సాయంత్రం 5 గంటల తరువాత నమోదు చేసుకున్న వాహనదారుల చరవాణికి రవాణాశాఖ అధికారులు సంక్షిప్త సమాచారం పంపిస్తామని చెబుతున్న సంయుక్త రవాణాశాఖ అధికారి రమేశ్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి
ఇదీ చూడండి: నూతన ఒరవడి: ఇకపై జిల్లాకు ఇద్దరు అదనపు కలెక్టర్లు