సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వద్ద డీవైఎఫ్ఐ నాయకులు నిరసనకు దిగారు. గాంధీ ఆస్పత్రిలో కొవిడ్ రోగులకు సరైన వసతులు కల్పించడం లేదని డీవైఎఫ్ఐ నాయకుడు మహేందర్ ఆరోపించారు. కరోనా కట్టడికి, రోగులకు చికిత్స అందించడానికి కేంద్రం నుంచి పెద్ద మొత్తంలో నిధులు వస్తున్నప్పటికీ వాటిని పూర్తిస్థాయిలో వినియోగించడం లేదని విమర్శించారు.
కరోనా పరీక్షలు చేయడంలోనూ ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున కరోనా పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లాక్ డౌన్ సడలింపు తరువాత వైన్ షాపులు, అన్ని రంగాల వారికి అనుమతులు ఇవ్వడం వల్ల కరోనా వ్యాప్తి మరింతగా పెరిగిందన్నారు. వైరస్ విస్తరిస్తున్న ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ... కొవిడ్ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చూడండి: ఈనెల 16న కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం