ETV Bharat / state

దసరా సెలవులు మరోవారం పొడిగింపు - undefined

dussera-holidays-extended-in-telangana
author img

By

Published : Oct 12, 2019, 4:07 PM IST

Updated : Oct 12, 2019, 7:33 PM IST

16:02 October 12

దసరా సెలవులు మరోవారం పొడిగింపు

దసరా సెలవులు మరోవారం పొడిగింపు

దసరా సెలవులను మరో వారం రోజుల పాటు ప్రభత్వం పొడిగించింది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో విద్యార్థులకు అసౌకర్యం కలగరాదన్న ఉద్దేశంతో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల సెలవులను ఈ నెల 19వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. రవాణా, విద్యాశాఖ మంత్రులు పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి, అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సిలబస్ నష్టపోకుండా భవిష్యత్​లో రెండో శనివారం కూడా విద్యాసంస్థలను నడపాలని, అవసరమైతే ఇతర సెలవులను కూడా తగ్గించుకోవాలని సీఎం స్పష్టం చేశారు. 21వ  తేదీ నుంచి అన్ని బస్సులు అందుబాటులోకి వస్తాయని... బస్ పాస్ విషయంలో ఏ ఒక్క విద్యార్థి కూడా బాధ పడొద్దని సీఎం వ్యాఖ్యానించారు. బస్ పాసులున్న విద్యార్థులందరూ యథావిధిగా విద్యాసంస్థలకు వెళ్లవచ్చని కేసీఆర్ తెలిపారు. 

ఇవీ చూడండి:సమ్మెలో పాల్గొన్న వారిని తిరిగి తీసుకోవద్దు'

Last Updated : Oct 12, 2019, 7:33 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.