ETV Bharat / state

Dussehra celebrations: రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా విజయదశమి వేడుకలు - తెలంగాణలో దసరా వేడుకలు

రాష్ట్రవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి (Dussehra celebrations). వేడుకల్లో చివరి రోజైన దసరా నాడు... ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. దేవతా మూర్తులను ఊరిగించిన భక్తులు.... దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా.... రావణసుర విగ్రహాన్ని దహనం చేశారు.

Dussehra celebrations
Dussehra celebrations
author img

By

Published : Oct 16, 2021, 5:48 AM IST

Updated : Oct 16, 2021, 6:40 AM IST

Dussehra celebrations: రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా విజయదశమి వేడుకలు

రాష్ట్రవ్యాప్తంగా దసరా ఉత్సవాలు అట్టహాసంగా జరిగాయి (Dussehra celebrations). పలు ప్రాంతాల్లోని మైదానాలు, ఆలయాల సమీపంలో రావణకాష్ఠం నిర్వహించారు. హైదరాబాద్‌ అంబర్‌పేట్‌లో రావణ ప్రతిమ దహన కార్యక్రమానికి హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హాజరుకాగా... కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు... రావణ విగ్రహానికి నిప్పటించారు. ముషీరాబాద్‌ జెమినీకాలనీలో దుర్గామాత విగ్రహాన్ని ఏర్పాటు చేసిన స్థానికులు... తొమ్మిదిరోజులు పాటు ప్రత్యేక పూజలు చేశారు ( Dussehra celebrations). చివరిరోజు అమ్మవారి విగ్రహం వద్ద భారీ లడ్డూను వేలంపాట నిర్వహించగా... ఓ భక్తుడు 2లక్షల 5వేలకు దక్కించుకున్నాడు. శేరిలింగంపల్లి లక్ష్మీవిహార్‌కాలనీ సాయిబాబా ఆలయంలో దసరా సందర్భంగా.... మహిళలు దాండియా ఆడి సందడి చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి శ్రీలక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో ప్రజలు జమ్మి పెట్టుకొని ఒకరికి ఒకరు దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి ఆధ్వర్యంలో రావణ దహనం పూర్తి చేశారు.

కన్నుల పండువగా భద్రకాళీ తెప్పోత్సవం

దసరా పర్వదిన వేళ వరంగల్ భద్రకాళీ అమ్మవారి తెప్పోత్సవం.... ఆద్యంతం కన్నులపండువగా జరిగింది ( Dussehra celebrations). అమ్మవారికి పూజలు చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌... తెప్పోత్సవంలో పాల్గొన్నారు. నర్సంపేటలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో శమీపూజ చేసిన ప్రజలు... జమ్మి పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం రావణాసుర వధ కార్యక్రమాన్ని నిర్వహించారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు జమ్మిచెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. బాన్సువాడలో సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి జమ్మిచెట్టుకు పూజ చేశారు. అనంతరం రావణ దహనం కార్యక్రమాన్ని పూర్తిచేశారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో దసరా వేడుకలు సందడిగా సాగాయి. సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహించిన డ్యాన్స్‌ పోటీల్లో... యువతీయువకులు తమ నృత్యాలతో హోరెత్తించారు.

వైభవంగా శమీపూజ, రావణ దహనం

భద్రాద్రిలో దసరా మహోత్సవాలు వైభవంగా జరిగాయి. లక్ష్మణ సమేత సీతారాములకు పట్టాభిషేకం, రామలీల మహోత్సవం వైభవంగా నిర్వహించారు. జమ్మికి పూజ చేసిన అనంతరం రావణాసురుని బొమ్మను దహనం చేశారు ( Dussehra celebrations). దసరా ఉత్సవాల్లో భాగంగా యాదాద్రిలో జమ్మిచెట్టుకు శమీపూజ నిర్వహించారు. 5వ శక్తి పీఠం జోగులాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో.... స్వామి అమ్మవార్లకు తెప్పోత్సవం నిర్వహించారు. నల్గొండలోని రామాలయంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ శమీపూజ చేసిన అనంతరం.... రావణసుర వధ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఖమ్మంలో శ్రీ స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఊరేగింపు వైభవంగా సాగింది. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం.... రావణాసుర దహనం చేశారు. విజయదశమి సందర్భంగా... ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలోని.... దేవతామూర్తులను వీధుల్లో ఊరేగించారు.

ఆదిలాబాద్​ పట్టణంలో అపశ్రుతి

ఆదిలాబాద్‌ పట్టణంలో విజయదశమి వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. దసనాపూర్‌లోని దసరా మైదానంలో రావణ దహన కార్యక్రమం నిర్వహిస్తుండగా టపాసులు జనంలోకి దూసుకొచ్చాయి. దీంతో పలువురికి స్వల్పగాయాలయ్యాయి. కార్యక్రమానికి అతిథులుగా హాజరైన ఎస్పీ రాజేష్ చంద్ర, ఎమ్మెల్యే జోగు రామన్న తదితరులు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.

ఇదీ చూడండి: bathukamma celebrations: రంగుల బతుకమ్మలతో పూల వనాలుగా మారిన పల్లెలు

Last Updated : Oct 16, 2021, 6:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.