ETV Bharat / state

సీఎం ​, అధికారులు ప్రొటోకాల్​ను ఉల్లంఘించారు : రఘునందన్ - భాజపా ఎమ్మెల్యే రఘునందన్​రావు వార్తలు

సిద్ధిపేట అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌, అధికారులు ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు మండిపడ్డారు. సిద్ధిపేట మున్సిపల్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వరాలు జల్లు కురిపించారని దుయ్యబట్టారు.

dubbaka mla raghunandan rao comments on cm kcr
సీఎం కేసీఆర్​, అధికారులు ప్రోటోకాల్​ను ఉల్లంఘించారు: రఘునందన్​రావు
author img

By

Published : Dec 11, 2020, 6:40 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌, అధికారులు సిద్దిపేటలో ప్రొటోకాల్‌ పాటించలేదని దుబ్బాక భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఎమ్మెల్యే రాజాసింగ్‌, ఎమ్మెల్సీ రాంచందర్‌రావుతో కలిసి రఘునందన్‌రావు మీడియాతో మాట్లాడారు.

‘‘దుబ్బాకలో వంద పడకల ఆసుపత్రిని పూర్తి చేయలేదు. మెడికల్‌ కళాశాలను దుబ్బాకలో కాకుండా సిద్దిపేటలో ఏర్పాటు చేశారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్‌కు రింగురోడ్డు ఉంటుంది.. దుబ్బాకకు ఉండదా?. వెయ్యి రెండు పడక గదుల ఇళ్లు దుబ్బాకకు అదనంగా ఇవ్వాలి. దుబ్బాకపై వివక్ష చూపించడం బాధాకరం. సిద్దిపేట మాదిరిగా దుబ్బాకకు నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరించాలి. దుబ్బాకకు కొత్త బస్తాండ్‌ మంజూరు చేయాలి. సిద్దిపేటకు అంతర్జాతీయ విమానాశ్రయం ఇస్తే దుబ్బాకకు ఒక బస్టాండ్‌ ఇవ్వరా?. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి 155 కిలో మీటర్ల పరిధిలో మరో అంతర్జాతీయ విమానాశ్రయం కట్టొద్దని అగ్రిమెంట్‌ ఉంది. ఈ విషయం సీఎంకు తెలియదా?. నాలుగేళ్ల క్రితం వరంగల్‌కు ఇచ్చిన అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడుందో సిద్దిపేటది కూడా అదే పరిస్థితి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సిద్దిపేటలో వరాల జల్లు కురిపించారు. ప్రొటోకాల్‌ పాటించని సీఎం కేసీఆర్‌, అధికారులపై ఫిర్యాదు చేస్తాం. కేంద్రం ఎక్కడా వివక్ష లేకుండా చూస్తుంటే.. కేసీఆర్‌ వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు.’’ -రఘునందన్​రావు, దుబ్బాక ఎమ్మెల్యే

ఇదీ చూడండి: తెరాస ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది: కిషన్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.