మందు బాబుల ఆట కట్టించేందుకు పోలీసులు మళ్లీ రంగంలోకి దిగారు. లాక్డౌన్ పూర్తి స్థాయిలో ఎత్తివేసిన నేపథ్యంలో మందు బాబుల పనిపట్టేందుకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు(Drunk and drive) మళ్లీ మొదలుపెట్టారు.
గత రాత్రి(శుక్రవారం) హైదరాబాద్ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోని పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఇక నుంచి మరింత కఠినతరంగా నిర్వహిస్తామని పోలీసులు వెల్లడించారు.
గతంలో కొవిడ్ లాక్డౌన్ కారణంగా డ్రంక్ అండ్ డ్రైవ్(Drunk and drive) తనిఖీలు పోలీసులు నిలిపివేశారు. దీంతో మందుబాబులు విచ్చలవిడిగా వాహనాలతో రోడ్లపైకి వచ్చేవారు. మద్యం మత్తులో వాహనాలు నడిపి పలు ప్రమాదాలకు కూడా కారణం అయ్యేవారు. ఇక నుంచి వారి ఆటలు సాగవని పోలీసులు హెచ్చరించారు.
ఇదీ చూడండి: నిషాలో హైదరాబాద్.. పర్యాటక కేంద్రాలే యువత స్పాట్