Drugs Worth Rs 50 Lakh Seized in Hyderabad : హైదరాబాద్ నగరం డ్రగ్స్‌కు అడ్డాగా మారుతోంది. ఉల్లాసంగా ఉండడానికి, యంగ్‌గా కనిపించడానికి, ప్రిస్టేజ్ కోసం చాలా మంది యువతీ యువకులు ఈ మాదక ద్రవ్యాలకు(Drugs) అలవాటు పడిపోతున్నారు. ముఖ్యంగా సమాజంపై తమ ప్రభావాన్ని చూపించే టాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ ఊబిలో చిక్కుకుంటున్నారు. అయితే తాజాగా హైదరాబాద్‌లోని సూరారంలో డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో(Narcotics Bureau)పోలీసులు అరెస్టు చేశారు.
సూరారం పోలీసులతో పాటు టీఎస్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించినట్లు నార్కోటిక్ బ్యూరో ఎస్పీ గుమ్మి చక్రవర్తి తెలిపారు. డ్రగ్స్ తయారు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు, వారి వద్ద నుంచి 60 గ్రాముల క్రిస్టల్ మెథాంఫెటమైన్, 700 ఎంఎల్ లిక్విడ్ మెథాంఫెటమైన్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
Narcotics Seized in Hyderabad : ఇప్పుడు పట్టుబడిన డ్రగ్స్ విలువ సుమారు రూ.50 లక్షలుగా ఉంటుందని నార్కోటిక్స్ ఎస్పీ గుమ్మి చక్రవర్తి పేర్కొన్నారు. డ్రగ్స్ తయారీలో ప్రధాన నిందితుడు కమ్మ శ్రీనివాస్‌గా గుర్తించామని, శ్రీనివాస్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ గాజుల రామారంలో ఉంటాడని అన్నారు. మణికంఠ కాకినాడ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఇతనికి చేపల చెరువులు ఉన్నాయని తెలిపారు.
తెలిసో తెలియకో మత్తుపదార్థాలు వినియోగిస్తున్నారా, ఐతే పోలీసులకు దొరికినట్టే
నరసింహ రాజు సూపర్ వైజర్ కం డ్రైవర్‌గా పని చేస్తున్నాడని పేర్కొన్నారు. కమ్మ శ్రీనివాస్ 2013లో ఓ పరిశ్రమలో ఇదే డ్రగ్స్ తయారీ చేశాడని.. ఆ సమయంలో ఎన్‌సీబీ వాళ్లు పట్టుకుని జైలుకు పంపారని చెప్పారు. నాలుగు సంవత్సరాల తర్వాత బయటకి వచ్చాడన్నారు. జైలు నుంచి బయటకి వచ్చాక నరసింహ రాజు, మణికంఠతో కలిపి డ్రగ్స్ తయారు చేయడం మొదలుపెట్టారని వివరించారు.
Methamphetamine Drug Seized in Hyderabad : సూరారంలో ఒక ఇంట్లో మెథాంఫెటమైన్ డ్రగ్స్(Methamphetamine Drug) తయారీ మొదలు పెట్టారని ఎస్పీ వెల్లడించారు. నిందితుడు కమ్మ శ్రీనివాస్‌కు డ్రగ్స్ తయారీపై అవగాహన ఉందన్నారు. ఈ ముగ్గురు సంయుక్తంగా గత రెండు సంవత్సరాలుగా డ్రగ్స్ తయారు చేసి వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారన్నారు. లిక్విడ్ మెథాంఫెటమైన్ ప్రాసెస్ చేసి డ్రై చేస్తే క్రిస్టల్ మెథాంఫెటమైన్ డ్రగ్ తయారు అవుతుందని వివరించారు. తయారు చేసిన డ్రగ్స్ వివిధ ప్రాంతాల్లో విక్రయించారని.. సోషల్ మీడియా ద్వారా విక్రయాలు కొనసాగించారని తెలిపారు. మెథాంఫెటమైన్ డ్రగ్ అనేది రిలాక్స్ మూడ్‌లోకి తీసుకెళుతుందని వినియోగిస్తారని తెలిపారు. ముగ్గురు నిందితులపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేస్తామన్నారు.
Kalti Medicines manufacture in Hyderabad : 'డ్రగ్స్ ఇండియా మహవీర్' పేరుతో.. కల్తీ మందుల తయారీ
Drugs Usage in Hyderabad : వామ్మో.. హైదరాబాద్‌లో అంతమంది డ్రగ్స్ వినియోగిస్తున్నారా!