ETV Bharat / state

మత్తు వదలరా..! డ్రగ్స్ వలయంలో యువత - నగరంలో డ్రగ్స్​ వ్యాపారం

యువత మత్తు వలయంలో చిక్కుకుంటోంది. సరదాగా సిగరెట్లు, మద్యంతో మొదలై.. క్రమంగా ఆ అలవాటు మాదకద్రవ్యాల సేవనం వరకు ఇది దారితీస్తోంది. గంజాయి విక్రయాలు నగరం నలుమూలలా జరుగుతుండటం వల్ల యువతపై డ్రగ్స్​ ప్రభావం అధికంగా ఉంటోంది. పరిస్థితి విషమించే వరకు చాలామంది తల్లిదండ్రులు గుర్తించకపోవడం వల్ల పలు కుటుంబాల వేదన వర్ణనాతీతంగా ఉంటోంది. నేడు అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ కథనం.

మత్తు వదలరా..! డ్రగ్స్ వలయంలో యువత
మత్తు వదలరా..! డ్రగ్స్ వలయంలో యువత
author img

By

Published : Jun 26, 2020, 10:41 AM IST

హైదరాబాద్​ నగరానికి చెందిన పదిహేడు ఏళ్ల బాలుడు గంజాయి మత్తులో వాహనం నడుపుతూ ప్రమాదానికి గురయ్యాడు. ప్రాథమిక చికిత్స తర్వాత తల్లిదండ్రులు అతడిని పునరావాస కేంద్రంలో చేర్పించారు. నిపుణుల కౌన్సెలింగ్‌లో మూడేళ్ల క్రితమే సిగరెట్లు, మద్యం తాగడం మొదలుపెట్టి ప్రస్తుతం గంజాయితోపాటు ఇతర మాదకద్రవ్యాల్ని సేవించడం ఆరంభించినట్టు తేలింది. తరచు గోవాకు వెళ్తూ డ్రగ్స్​ తెచ్చి అమ్ముతున్నాడు. అధిక మోతాదులో హెరాయిన్‌ తీసుకొని బీచ్‌లో పడి ఉన్న కొడుకు గురించి గోవా పోలీసులు ఫోన్​ చేయడం తల్లిదండ్రుల్ని షాక్​కి గురి చేసింది. ఆ అబ్బాయిని అక్కడినుంచి తీసుకొచ్చిన తర్వాత కూడా అదే అలవాటు కొనసాగిస్తూ ప్రమాదానికి గురయ్యాడు. ప్రైవేట్​ కళాశాలలో చదువుతున్న ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి కాలేజీకి వెళ్లి అసాధారణంగా ప్రవర్తించాడు. ఈ విషయం గమనించిన యాజమాన్యం అతడిని కాలేజీ నుంచి సస్పెన్స్​ చేసింది. తల్లిదండ్రులు ఆ కుర్రాడికి కౌన్సిలింగ్​ ఇప్పించగా.. రెండేళ్లుగా అతడు మత్తుపదార్థాలకు అలవాటు పడినట్లు తేలింది. మాదకద్రవ్యాలు కొనేందుకు డబ్బు కోసం బైక్‌ రేస్​లలో పాల్గొంటున్నట్టు తేలింది. డ్రగ్స్​ కొని అతడు చదివే కాలేజీలో అమ్ముతూ.. కాలేజీ నుంచి సస్పెండ్ అయ్యాడు.

లాక్‌డౌన్‌ సమయంలో దేశమంతా ఎక్కడికక్కడ స్తంభించి పోయింది. కానీ మత్తు పదార్థాల దందా మాత్రం విస్తృతంగా సాగింది. ఒకప్పుడు ఈ ముఠాలకు నగరంలో చిరునామాగా ఉండే బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల నుంచి పరిస్థితి బస్తీలకు మారిపోయింది. గోల్కొండ లక్ష్మీనగర్‌, ధూల్‌పేట, ఎల్‌బీనగర్‌ సర్కిల్‌లో కొన్ని ప్రాంతాలు, అమీర్‌పేట, ఎస్సార్‌నగర్‌, ముషీరాబాద్‌, కూకట్‌పల్లిలలో కొన్ని గల్లీలకు సైతం మత్తు పదార్థాల దందా విస్తరిస్తోంది.

తల్లిదండ్రులే గుర్తించాలి

విద్యార్థులు పెడధోరణి పడుతున్న ఆరంభంలోనే గుర్తించగలిగితే పరిస్థితి చేయిదాటదు. గతానికి భిన్నంగా విపరీత ధోరణుల్ని ప్రదర్శించడం, బ్యాక్‌లాగ్స్‌ పెరిగిపోవడం, నిర్లిప్తంగా ఉన్నట్లు గమనిస్తే తల్లిదండ్రులు అప్రమత్తం కావాలి అని సూచిస్తున్నారు అమృత ఫౌండేషన్​ వ్యవస్థాపకురాలు డాక్టర్​ దేవికారాణి.

సామాజిక మాధ్యమాల్లోనే ‘దందా..

విద్యార్థుల చరవాణుల్లో వాట్సప్‌, స్నాప్‌చాట్‌, ఇన్‌స్టాగ్రామ్‌, టెలీగ్రామ్‌లాంటి యాప్‌నలు నిత్యం తనిఖీ చేయాలి. సాధారణంగా ఇలాంటి సామాజిక మాధ్యమాల్లోనే డ్రగ్స్‌ కోసం సంభాషణలు సాగిస్తుంటారు. చాటింగ్‌లో వీడ్, స్కోర్, స్టఫ్, యాసిడ్​ పేపర్​, ఓసీబీ, కోక్, ఎండీ, జాయింట్​, స్టాష్, మాల్, ఖాష్, స్టోన్ర్, పెడ్లర్, దమ్, పాట్, క్రిస్టర్, బూమ్, డీపీ వంటి పదాలతో రహస్య సంభాషణ సాగిస్తున్నారు. ఈ పదాలు మీ పిల్లల ఛాటింగ్​లో కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. చరవాణుల వాల్‌పేపర్లు, డెస్క్‌టాప్‌ పిక్చర్స్‌, స్క్రీన్‌సేవర్లలో పొగతో కూడిన బొమ్మలు, మల్టీకలర్‌ ఇమేజ్‌లుంటే అనుమానించాలి.

ప్రాథమిక దశలో కనిపెట్టడమే కీలకం

ఇంజినీరింగ్‌ విద్యార్థుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు మానసిక నిపుణులు. స్నేహితులతో కలిసి టెర్రస్‌పై ఎక్కువసేపు గడుపుతుంటే గమనించాలి. పర్యవేక్షకులు లేకుండా గోవాలాంటి చోట్లకు పంపకపోవడమే ఉత్తమం. విద్యార్థుల బ్యాగ్‌ల్లో ఒ.సి.బి పేపర్‌, లైటర్‌, ఐడ్రాప్స్‌ తదితర వస్తువుల్ని గమనిస్తే గంజాయి సేవిస్తున్నట్లు అనుమానించాలి. తరచూ సాధారణం కంటే ఎక్కువ డబ్బులు అడుగుతుంటే ఆరా తీయాలి. ఇంటికి దూరంగా ప్రైవేటు గదుల్లో, వసతిగృహాల్లోఉంటే అకస్మాత్తుగా వెళ్లి చెక్​ చేయాలి. మాదకద్రవ్యాల సరఫరాతో పాటు వినియోగం కూడా నేరమే అన్న విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పాలి. డ్రగ్స్​ వినియోగిస్తూ దొరికితే ఎన్‌డీపీఎస్‌ చట్ట ప్రకారం ఏడాది వరకు కఠిన కారాగార శిక్ష లేదా రూ.20వేల వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చని అవగాహన కల్పించాలి.

ఇవీ చూడండి: పచ్చని పండుగ: హరిత తెలంగాణే లక్ష్యం... ప్రతిమొక్కనూ బతికిద్దాం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.