Drugs Supply At Hyderabad Hotels : సండే కదా ఈరోజు కూడా వంట ఏం చేస్తాంలే అని ఫ్రెండ్స్‌తో కలిసి రెస్టారెంట్‌కు వెళ్దాం అనుకున్నాను. ఏ రెస్టారెంట్(Restaurant) బెటరో అని రేటింగ్ చూద్దామని మొబైల్ తీసుకున్నాను. అలా మొబైల్ ఆన్ చేశానో లేదో.. 'బిర్యానీలో ఎక్స్ట్రా రైతా అడిగాడని కస్టమర్‌ను కొట్టిన రెస్టారెంట్ సిబ్బంది.. యువకుడి మృతి' అంటూ ఓ నోటిఫికేషన్ వచ్చింది. అది చూడగానే గుండె దఢేల్మనిపించింది. సర్లే అన్ని రెస్టారెంట్లు అలా ఎందుకుంటాయని నాకు నేనే ధైర్యం చెప్పుకుని దగ్గరలో ఉన్న బెస్ట్ రెస్టారెంట్ ఏంటని చూద్దామనుకునేలోగా.. 'డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ వరలక్ష్మి టిఫిన్ సెంటర్ యజమాని' అంటూ మరో నోటిఫికేషన్. రెండోది చూడగానే గుండె జారి కిందపడ్డంత పనైంది.
-
#Meridian #Punjagutta #Murder #MeridianRestaurant #Biryani #Extraraita #Raita #Hyderabad https://t.co/QI738PyexU pic.twitter.com/nrOlP07MqA
— Phirangi© (@PhirangiQuotes) September 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#Meridian #Punjagutta #Murder #MeridianRestaurant #Biryani #Extraraita #Raita #Hyderabad https://t.co/QI738PyexU pic.twitter.com/nrOlP07MqA
— Phirangi© (@PhirangiQuotes) September 12, 2023#Meridian #Punjagutta #Murder #MeridianRestaurant #Biryani #Extraraita #Raita #Hyderabad https://t.co/QI738PyexU pic.twitter.com/nrOlP07MqA
— Phirangi© (@PhirangiQuotes) September 12, 2023
Hyderabad Restaurant Staff Beating Customers : ఎందుకంటే.. రోజు నేనూ, నా ఫ్రెండ్స్ కలిసి ఉదయాన్నే టిఫిన్ చేసే హోటల్ అదే. ఇదే విషయం నా ఫ్రెండ్స్‌కు కాల్ చేసి చెప్పాను. అప్పుడు వాళ్లు చెప్పిన మాటలు విన్న నాకు.. ఈ చదువులు, ఉద్యోగాలు మనకెందుకు .. బతికుంటే బచ్చలాకైనా తినొచ్చు అనిపించి పెట్టెబేడా సర్దుకొని ఊరెళ్లాలనిపించింది. అలాగని తిండి కోసం ఊరొచ్చేస్తానంటే మా నాన్న బెల్టు తీసి మరీ కొడతాడు. హైదరాబాద్ ఫుడ్ బిజినెస్(Hyderabad Food Business)లో జరుగుతున్న అక్రమాల గురించి తెలిసి.. ఇక ఇంట్లోనే వండుకోవడం బెటర్ అనిపించింది. వంట రాకపోయినా.. చేయాలనిపించకపోయినా ఆ పూటకు పస్తులుండటమే మేలని అనిపించింది. ఇంతకీ హైదరాబాద్ హోటళ్లు, రెస్టారెంట్లలో ఏం జరుగుతుందో తెలుసా..?
-
Eedu Tiffin ivvadaniki intha late chesinapude anukunnara 😹🧑🦯..#VaralakshmiTiffins pic.twitter.com/LardaUNmLM
— సిద్దార్థ_రాయ్ 💫#OG (@Siddu4PSPK2) September 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Eedu Tiffin ivvadaniki intha late chesinapude anukunnara 😹🧑🦯..#VaralakshmiTiffins pic.twitter.com/LardaUNmLM
— సిద్దార్థ_రాయ్ 💫#OG (@Siddu4PSPK2) September 12, 2023Eedu Tiffin ivvadaniki intha late chesinapude anukunnara 😹🧑🦯..#VaralakshmiTiffins pic.twitter.com/LardaUNmLM
— సిద్దార్థ_రాయ్ 💫#OG (@Siddu4PSPK2) September 12, 2023
ఇటీవలే ఓ హోటల్లో బిర్యానీ తిందామని వెళ్లిన వ్యక్తి.. హాయిగా బిర్యానీ లాగించిన తర్వాత చివరలో రైతా కోసం చూశాడు. హోటల్ వాళ్లు ఇచ్చిన రైతా సరిపోక.. ఎక్స్ట్రా రైతా కావాలని అడిగాడు. దానికి ఆ హోటల్ సిబ్బంది ఎక్స్ట్రా రైతా (Restaurant Staff Beating Customers)ఇవ్వడం కుదరదంటూ కస్టమర్‌పై విరుచుకుపడ్డాడు. ఇలా మాటలతో మొదలైన గొడవ కొట్టుకునే దాకా వచ్చింది. ఇద్దరూ పడిన ఘర్షణలో కస్టమర్ మరణించాడట. బిర్యానీ తిందామని వెళ్తే.. ఏకంగా ప్రాణాలే పోయాయి పాపం.
-
🏃🏃#varalakshmitiffins pic.twitter.com/4Iv5VsB3Lz
— #THEOGచందు🇮🇳 (@Suribabulavagam) September 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">🏃🏃#varalakshmitiffins pic.twitter.com/4Iv5VsB3Lz
— #THEOGచందు🇮🇳 (@Suribabulavagam) September 12, 2023🏃🏃#varalakshmitiffins pic.twitter.com/4Iv5VsB3Lz
— #THEOGచందు🇮🇳 (@Suribabulavagam) September 12, 2023
బిర్యానీలో బొద్దింక వచ్చిందంట! : సరే ఎక్స్ట్రా రైతా అడిగితే కొట్టారు కదా.. అడగకపోయుంటే బతికేవాడేమోనని నాకు నేనే సర్దిచెప్పుకున్నాను. కానీ ఇంకో దగ్గర బిర్యానీ తింటుంటే అందులో బొద్దింక వచ్చిందట. బిర్యానీ సర్వ్ చేసినప్పుడైనా చూసుకోవాలి కదా. మరీ బొద్దింక బిర్యానీ సర్వ్ చేయడమేంటి. పాపం ఆ కస్టమర్ కోపం తట్టుకోలేక హోటల్ సిబ్బందిని అడిగాడట. బొద్దింక వచ్చిందని అడిగినందుకు ఆ హోటల్ సిబ్బంది కస్టమర్‌ను చితక్కొట్టారట. ఇలా ఆ హోటల్‌కు వెళ్లినందుకు బొద్దింక బిర్యానీతో సహా నాలుగు దెబ్బలు కాంప్లిమెంటరీగా వచ్చాయి పాపం ఆ కస్టమర్‌కు.
-
#VaralakshmiTiffins pic.twitter.com/96C6Kq6pIU
— Uzumaki Vicky (@Uzumaki_Vikky) September 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#VaralakshmiTiffins pic.twitter.com/96C6Kq6pIU
— Uzumaki Vicky (@Uzumaki_Vikky) September 12, 2023#VaralakshmiTiffins pic.twitter.com/96C6Kq6pIU
— Uzumaki Vicky (@Uzumaki_Vikky) September 12, 2023
Drugs Supply At Varalakshmi Tiffin Centre Hyderabad : ఇవన్నీ ఒక ఎత్తయితే ఇప్పుడు తాజాగా కొన్ని హూటళ్లలో డ్రగ్స్(Drugs) కూడా విక్రయిస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. కస్టమర్లు అధికంగా వచ్చే ప్రాంతాలు కావడం.. ఇక్కడైతే ఎవరికి ఏ అనుమానం రాదన్న కారణంతో కొందరు యజమానులు, అక్కడ పనిచేసే సిబ్బంది ఈ దందాకు తెరలేపుతున్నారట. మేం రోజు వెళ్లే హోటల్లోనే ఈ డ్రగ్స్ గుట్టు బయటపడింది. ఇక ఆ హోటల్‌కే కాదు.. హైదరాబాద్‌లో ఏ హోటల్‌కు వెళ్లాలన్నా భయమేస్తోంది. ఎక్కడ ఆ హోటల్ కస్టమర్ల లిస్టు చూసి రెగ్యులర్ కస్టమర్(Regular Customer) అని డ్రగ్స్ కేసులో ఇరికించేస్తారేమోనన్న భయం పట్టుకుంది నాకు. ఇలా ఉంది ఫ్రెండ్స్ హైదరాబాద్‌లో పలు హోటళ్లు, రెస్టారెంట్ల తీరు. దీనికంటే ఇంట్లోనే హాయిగా వండుకొని తినడం బెటర్ అనిపిస్తోంది కదా. అలాగే చేయండి మరి.. డబ్బుకు డబ్బు ఆదా.. ఆరోగ్యానికి ఆరోగ్యం కలిసి వస్తుంది.
బిర్యానీ అంటే ప్రాణం! ఏడాదిలో ఎన్ని కోట్లు ఆర్డర్ చేశారంటే..