ETV Bharat / state

Drugs Seized in Hyderabad : హైదరాబాద్​లో రెండు వేేర్వేరు ఘటనల్లో.. రూ.70 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత - MDMA Drug Latest News

Drugs Seized in Hyderabad : మాదకద్రవ్యాల రవాణాపై హైదరాబాద్ పోలీసులు కొరడా ఝలిపిస్తున్నారు. తాజాగా నగరంలో.. రెండు వేర్వేరు ఘటనలో డ్రగ్స్​ సరఫరా చేస్తోన్న.. ఇద్దరు నిందితుల గుట్టును రట్టు చేశారు. వారి నుంచి మత్తు పదార్థాలు, చరవాణిలను స్వాధీనం చేసుకున్నారు.

Drugs seized in Rachakonda Commissionerate
Drugs bust in Hyderabad
author img

By

Published : Aug 9, 2023, 10:20 PM IST

Updated : Aug 9, 2023, 10:33 PM IST

Drugs Seized in Hyderabad : హైదరాబాద్​లో మత్తుపదార్థాల సరఫరాపై.. పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా రాజస్థాన్ నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను రాచకొండ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. రెండు వేర్వేరు కేసుల్లో ఇద్దరు నిందితుల నుంచి రూ.70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను రాచకొండ సీపీ డీఎస్​ చౌహాన్ వెల్లడించారు.

Drugs bust in Hyderabad : ఏడాది క్రితం వ్యాపారం నిమిత్తం రాజస్థాన్​లోని జాలొరు జిల్లాకు చెందిన దీపారామ్​ హైదరాబాద్​కు వచ్చాడని డీఎస్ చౌహాన్ తెలిపారు. గ్రానైట్ వ్యాపారం నిర్వహిస్తున్న అతను మాదకద్రవ్యాలకు (Drugs)బానిస అయ్యాడని చెప్పారు. ఈ క్రమంలో రాజస్థాన్​కు చెందిన రమేశ్​కుమార్​తో పరిచయం ఏర్పడిందని పేర్కొన్నారు. రమేశ్​ నుంచి హెరాయిన్, ఎండీఏంఏ కొనుగోలు చేసిన దీపారామ్​.. కొరియర్ ద్వారా వాటిని నగరానికి తీసుకొచ్చాడని డీఎస్​ చౌహాన్ వివరించారు.

అపార్ట్​మెంట్​లో గంజాయి పెంచుతున్న సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​.. యూట్యూబ్​లో నేర్చుకుని మరీ..

మరోవైపు మాదక ద్రవ్యాలను దీపారామ్​ వినియోగించడంతోపాటు.. ఇతరులకు విక్రయించి డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాడని డీఎస్ చౌహాన్ తెలిపారు. ఈ మేరకు ఎల్బీనగర్ ఎస్ఓటి పోలీసులు పక్కా సమాచారం అందిందని.. అతడిపై నిఘాపెట్టి చైతన్యపురి పోలీస్​స్టేషన్ పరిధిలోని నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అతడి వద్ద నుంచి హెరాయిన్​తో పాటు ఎండిఎంఏ (MDMA Drug) డ్రగ్​ను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఈ క్రమంలోనే దీపారామ్​కు మాదకద్రవ్యాలు సరఫరా చేసిన రమేశ్​ కోసం గాలిస్తున్నట్లు చౌహాన్ వెల్లడించారు.

Telangana Narcotics Bureau(TNAB) : 'అవగాహనతోనే యువతను డ్రగ్స్​కు దూరంగా ఉంచగలం'

మరో కేసులో పదేళ్ల క్రితం రాజస్థాన్ నుంచి హైదరాబాద్​కు వచ్చి ఇక్కడే స్థిరపడిన.. మహేందర్ సింగ్ అనే వ్యక్తిని.. మహేశ్వరం జోన్ ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేశారని డీఎస్ చౌహాన్ తెలిపారు. నిందితుడి నుంచి 2.2 కిలోల ఓపియం డ్రగ్​ను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. తుర్కయంజాల్​లోని రామనగర్​లో ఉంటున్న మహేందర్ సింగ్ కిరాణా దుకాణాన్ని నిర్వహిస్తున్నాడని వివరించారు. కరోనా సమయంలో నష్టాలు రావడంతో.. మాదకద్రవ్యాలకు బానిస అయ్యాడని డీఎస్ చౌహాన్ పేర్కొన్నారు.

Choutuppal Police Seized Drugs : గోవా టు హైదరాబాద్​ డ్రగ్స్​ సరఫరా.. కీలక నిందితుడి అరెస్ట్

ఈ క్రమంలోనే మత్తుపదార్థాలను విక్రయించి సులభంగా డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో మహేందర్ సింగ్.. రాజస్థాన్​లోని బిల్వాడ జిల్లా బాగోర్​తండాలో ఓపియం అనే మాదకద్రవ్యానికి సంబంధించిన పంటను సాగు చేశాడని డీఎస్ చౌహాన్ వివరించారు. అక్కడి నుంచి ప్రైవేట్ బస్సులో ఓపియం డ్రగ్​ను తీసుకొచ్చి అధిక ధరకు విక్రయించడం మొదలుపెట్టాడని చెప్పారు. దీనిపై మహేశ్వరం జోన్ ఎస్ఓటి పోలీసులకు సమాచారం తెలియడంతో.. అతడిని అరెస్ట్ చేసి ఓపియం డ్రగ్​ను స్వాధీనం చేసుకున్నామని డీఎస్ చౌహాన్ తెలిపారు.

ఇరువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు డీఎస్ చౌహాన్ పేర్కొన్నారు. నిందితులను రిమాండ్​కు తరలించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే కొరియర్ సంస్థలు పార్శిల్స్​పై​ నిఘా పెట్టాలని సీపీ సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సదరు కొరియర్ సంస్థల పైన చర్యలు తీసుకుంటామని డీఎస్ చౌహాన్ హెచ్చరించారు.

"వేర్వేరు ఘటనల్లో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశాం. వారి వద్ద నుంచి రూ.70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాం. కొరియర్ సంస్థలు పార్శిల్స్​పై​ నిఘా పెట్టాలి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సదరు కొరియర్ సంస్థల పైన చర్యలు తీసుకుంటాం." - డీఎస్ చౌహాన్, రాచకొండ సీపీ

Drugs Seized in Hyderabad హైదరాబాద్​లో రెండు వేేర్వేరు ఘటనల్లో రూ.70 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత

Nigerian Drug Dealers Hyderabad : డ్రగ్స్ దందాలో.. నైజీరియన్ల రూటే సపరేటు

KP Chowdary Drugs Case : డ్రగ్స్ కేసు విచారణలో కేపీ చౌదరి కీలక విషయాలు వెల్లడి.. జాబితాలో 12 మంది ప్రముఖులు.!

Last Updated : Aug 9, 2023, 10:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.