Drugs Seize in Rayadurgam : గోవా నుంచి హైదరాబాద్‌కు మాదక ద్రవ్యాలను తరలించి విక్రయాలు జరుపుతున్న నలుగురు ముఠా సభ్యులను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 32 గ్రాముల కొకైన్‌తో పాటు మొబైల్ ఫోన్లు, ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకోన్నారు. రాజమండ్రికి చెందిన విక్కీ, రాజేష్ గోపిశెట్టి, నరేష్, తోట క్రాంతి కుమార్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.

Madhapur Drugs Case Updates : నిత్యం వివాదాలకు కేరాఫ్ అడ్రస్ @ యాక్టర్ నవదీప్
Drug Selling Gang Arrested in Rayadurgam : ప్రధాన నిందితుడు విక్కీ సులభంగా డబ్బులను సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకొని నగరంలో డ్రగ్స్ అమ్మకాలను జరుపుతున్నారని పోలీసులు తెలిపారు. విక్కీ, రాజేశ్‌లు చిరు వ్యాపారులకు కొకైన్‌ను డెలివరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులపైనా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామన్నారు. గతంలో కూడా విక్కీ డ్రగ్స్ విక్రయాలను జరిపిన్నట్లు పోలీసులు గుర్తించామన్నారు.
ED Calls navdeep : మరోవైపు మదాపూర్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సినీనటుడు నవదీప్‌కు(Cine Actor Navdeep) ఈడీ నోటీసులు జారీచేసింది. ఈ నెల 10న విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. డ్రగ్స్‌తో పాటు మనీలాండరింగ్ కోణంలోనూ ఈడీ విచారణ చేపట్టనుంది. ఇప్పటికే ఈ కేసులో నార్కోటిక్ పోలీసులు నవదీప్‌ను విచారించారు. తన మొబైల్లో ఉన్న డేటాని డిలీట్ చేసినట్లు గుర్తించామని పోలీసులు పేర్కొన్నారు.
Madhapur Drugs Case : ఈ కేసులో 81 లింక్‌లు గుర్తించారని అన్నారు. అందులో 41 లింకులపై ఉన్న వివరాలను తెలిపాడని వివరించారు. అతను డ్రగ్స్ వాడకం గురించి అడిగితే.. గతంలో వినియోగించారని.. సిట్, ఈడీ విచారణలో చెప్పిన విషయాన్ని చెప్పారన్నారు. ప్రస్తుతం మాత్రం డ్రగ్స్ వాడలేదని సమాధానమిచ్చాడని అన్నారు. నవదీప్‌కి, రామ్చంద్కి సంబంధం ఏమిటని ఆరా తీశామని వెల్లడించారు. దానికి సమాధానంగా నవదీప్(Navdeep) గతంలో వారు కలిసి బీపీఎం పబ్ నిర్వహించారన్నారు. తన ఫోన్ తీసుకుని పరిశీలించారని తెలిపారు. తన మొబైల్లో ఉన్న డేటాని డిలీట్ చేశారని.. అతని ఫోన్ రీట్రైవ్ చేసి మళ్లీ విచారిస్తామని స్పష్టం చేశారు.
మాదాపూర్ రేవు పార్టీ డ్రగ్స్ కేసులో.. మొదటగా పట్టుబడిన సినీ ఫైనాన్షియర్ కె.వెంకటరత్నారెడ్డి, బాలాజీని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించగా.. సినీ పరిశ్రమకు చెందిన అనేక మంది పేర్లు, నైజీరియన్లతో డ్రగ్స్ లింకులు వెలుగులోకి వచ్చాయి. నిందితుల నుంచి 2.8 గ్రాముల కొకైన్, 6 ఎల్‌ఎస్డీ బోల్ట్స్, 25 ఎక్స్‌ట్రాపిల్స్, 40 గ్రాముల గంజాయి, రూ.72,500 నగదు, 2 కార్లు, 5 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.
డ్రగ్స్ స్మగ్లింగ్‌పై కేంద్రం ఉక్కుపాదం.. 1.44 లక్షల కిలోల మాదకద్రవ్యాలు ధ్వంసం