నిషేధిత డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఓ ముఠాను సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించగా... మరో ఇద్దరు పరారయ్యారు. నిందితుల నుంచి 600 గ్రాముల నార్కోటిక్ హెపిడ్రిన్ డ్రగ్, 3 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. యువకులను, క్రీడాకారులను లక్ష్యంగా చేసుకొని... అనంతపురంకు చెందిన చెన్నకేశవులు, రమణ, శ్రీనివాస్ నాయుడు, తాడిపత్రికి చెందిన అహ్మద్ అలీ, గాజులరామారంకు చెందిన కిశోర్‌లు కలిసి హైదరాబాద్‌లో మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నారు. బోయిన్‌పల్లిలోని స్వీట్హాట్ హోటల్ వద్ద నిందితులు డ్రగ్స్ అమ్ముతుండగా... పక్కా సమాచారంతో పోలీసులు మాటు వేసి పట్టుకున్నారు. ఇందులో రమణ, శ్రీనివాస్ నాయుడులు తప్పించుకోగా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.