Drug Gangs Hulchal in Hyderabad : హైదరాబాద్‌లో మత్తు ముఠాలు హల్‌చల్ చేస్తున్నాయి. కాలనీలు, బస్తీలో పోలీసు గస్తీ లోపాన్ని తమకు అనుకూలంగా మలచకుంటున్నాయి. టాస్క్‌ఫోర్స్, టీఎస్‌న్యాబ్, ఎస్వోటీ వంటి ప్రత్యేక పోలీసు బృందాలు గుర్తిస్తే తప్ప గంజాయి (Ganja) విక్రేతలను గుర్తించలేక పోతున్నారు. పోలీసు కమిషనరేట్ల పరిధిలో పెంచిన పోలీస్‌స్టేషన్‌ల సంఖ్యకు అనుగుణంగా పూర్తిస్థాయి మౌలిక వసతులు, వాహనాలు సమకూర్చ లేకపోయారు.
Ganja Batches Hulchal in Hyderabad : పాత పోలీస్‌స్టేషన్‌ల నుంచే సిబ్బంది, వాహనాలు కేటాయించారు. ఎన్నికలు, పండుగలు, బందోబస్తు విధుల్లో పోలీసులు తలమునకలై ఉన్నారు. తద్వారా సిబ్బంది రాత్రిళ్లు గస్తీ చూసీ చూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి. హైదరాబాద్‌లో 100కు పైగా పెట్రోలింగ్ కార్లు ఉన్నాయి. 200కు పైగా ద్విచక్రవాహనాలున్నాయి. ద్విచక్రవాహనాల్లో అధికశాతం సిబ్బంది వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటున్నట్టు తెలుస్తోంది.
Nigerian Drug Dealers Hyderabad : డ్రగ్స్ దందాలో.. నైజీరియన్ల రూటే సపరేటు
దాడిచేసినా, దోచుకున్నా అంతే : మాంగార్ బస్తీలో చిల్లర దొంగలు కొత్త దారి పట్టారు. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి మత్తు మాత్రలు తీసుకువచ్చి, ఇక్కడి యువకులకు విక్రయిస్తున్నారు. ఇటీవల టీఎస్‌న్యాబ్ పోలీసులు ఒకరిని అరెస్ట్ చేసినప్పుడు బడా రాకెట్ వెలుగులోకి వచ్చింది. గుల్బర్గాలో ఒక్కో మాత్రను రూ.5కు కొనుగోలుచేసి ఇక్కడ రూ.20కు అమ్ముతున్నట్టు దర్యాప్తులో గుర్తించారు. ఈ కాలనీలో 50 మంది వరకూ ఏడాదిగా ఇదే దందా చేస్తున్నారని పోలీసులు తెలిపారు.
మాదక ద్రవ్యాలకు అడ్డాగా మారిన ప్రాంతాలు ఇవే
- మాంగార్‌బస్తీ మత్తు బిళ్లల విక్రయం
- చాంద్రాయణగుట్ట, సంతోష్‌నగర్‌లోని కొన్ని ప్రాంతాల్లో గంజాయి విక్రయం
- చిక్కడపల్లి, భోలక్‌పూర్, ముషీరాబాద్ ప్రాంతాల్లో జోరుగా గంజాయి విక్రయాలు
- ఫిల్మ్‌నగర్, బంజారాహిల్స్, బోరబండల్లోని కొన్ని బస్తీల్లో మద్యం విక్రయాలు
Mob Attack Cases Hyderabad : బెల్ట్ షాపుల్లో దగ్గు మందు, మత్తు మాత్రలు, గంజాయి విక్రయిస్తున్నట్టు టీఎస్‌న్యాబ్ పోలీసులు భావిస్తున్నారు. పలు కాలనీల్లో గంజాయి బ్యాచ్‌లు మత్తులో స్థానికులను బెదిరించడం, సెల్‌ఫోన్లు, నగలు తస్కరిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఉత్తర మండల పరిధి సమీపంలో నలుగురు యువకులు ప్రయాణికులను కత్తితో బెదిరించి సెల్‌ఫోన్లు ఎత్తుకెళ్లారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళితే బెదిరించినట్టు వద్దని, బస్సులో సెల్‌ఫోన్ పోయినట్టు ఫిర్యాదు చేయమంటూ ఇన్‌స్పెక్టర్ ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.
ద్విచక్రవాహనంపై వెళ్లేవారిని లక్ష్యంగా చేసుకొని : టోలిచౌకి, గోల్కొండలో కొందరు యువకులు ముఠాలుగా ఏర్పడి ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ప్రాంతాల నుంచి హ్యాష్ ఆయిల్ తీసుకొస్తున్నారని పోలీసులు తెలిపారు. నివాసాల మధ్య వాటిని నిల్వ చేసి మైనర్లతో కొనుగోలుదారులకు చేరవేస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. ఫలక్‌నుమా ప్రాంత పాత నేరస్థులు రాత్రిళ్లు ద్విచక్రవాహనంపై వెళ్లేవారిని లక్ష్యంగా చేసుకొని దోపిడీలకు పాల్పడుతున్నట్లు వివరించారు. నేరాలకు పాల్పడే ముందు గంజాయి తీసుకొని రంగంలోకి దిగుతారని వివరించారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారి కళ్లల్లో కారం కొట్టి వారు కిందపడగానే విలువైన వస్తువులు కొట్టేసి పారిపోతారని పోలీసులు వెల్లడించారు.
Hyderabad customs police destroy drugs : 'రూ.950 కోట్ల విలువైన డ్రగ్స్ ధ్వంసం చేశారు'
ఇప్పుడేం జరుగుతోందంటే : సౌత్ ఈస్ట్ పరిధిలో ప్రధాన పోలీస్‌స్టేషన్ ద్విచక్రవాహనాలు మొరాయించడంతో ఒకే ఒక్క పెట్రోలింగ్ కారుతో కొన్ని కాలనీలు చుట్టొస్తున్నామంటూ ఆ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ తెలిపారు. పశ్చిమ మండలం పరిధిలో కొత్తగా ఏర్పాటైన ఠాణా పరిధిలో 20 వరకు బస్తీలున్నాయి. అక్కడ నైజీరియన్లు అధిక సంఖ్యలో ఉంటారు. చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిన ఉగ్రవాదులు ఇక్కడే పట్టుబడ్డారు.
అటువంటి సున్నితమైన ప్రాంతంలో డయల్ 100కు కాల్ వెళ్తే ఘటనా స్థలానికి చేరేందుకు అరగంట సమయం వెచ్చించాల్సి వస్తోంది. ఇటీవల టోలిచౌకి నుంచి ఒక వ్యక్తి పోలీసులకు ఫోన్ చేస్తే పలు ప్రశ్నలు వేసి ఇప్పుడు రావటం కుదరదంటూ వదిలేశారంటూ ఆ బాధితుడు ఆవేదన వెలిబుచ్చారు. తూర్పు, దక్షిణ, ఉత్తర మధ్య మండలాల పరిధిలో 10-12 పోలీస్‌స్టేషన్ల పరిధిలో రాత్రి గస్తీ (Police patrol) అస్తవ్యస్తంగా ఉన్నట్టు ఉన్నతాధికారులు గుర్తించారు. అర్ధరాత్రి దాటేంత వరకూ బార్ అండ్ రెస్టారెంట్లు, హోటళ్లు, ఐస్‌క్రీమ్ పార్లర్లు, పాన్‌దుకాణాలు తెరిచి ఉండటాన్ని గుర్తించి నలుగురు ఇన్‌స్పెక్టర్లకు ఛార్జి మెమోలు జారీ చేసినట్టు తెలుస్తోంది.
గంజాయి గ్యాంగ్ ఆగడాలు.. బట్టలు విప్పి.. బెల్టుతో కొడుతూ దాడి
midnight violence in Hyderabad : ఆకతాయిల ఆగడాలకు అడ్డుకట్ట వేసేదేలా?