నూతన ట్రాఫిక్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ టూ వీలర్ రైడర్స్ అసోసియేషన్ తెలిపింది. మద్యపానం నిషేధం అమలు చేసి తర్వాత ట్రాఫిక్ చలాన్లు వేయాలని అసోషియేషన్ కన్వీనర్ మహమ్మద్ అమానుల్లాఖాన్ అన్నారు. ప్రభుత్వం ఖజానా నింపుకోవడానికే చలాన్లు పెంచారని...ఈ చట్టానికి వ్యతిరేకంగా సెప్టెంబర్ 1న బ్లాక్‌డే గా పాటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంగ్లేయులు తీసుకువచ్చిన హెల్మెట్‌ను వదలాలని తలపాగాను ధరించాలని తెలిపారు.
ఇదీ చూడండి :గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కార్యాచరణ