ETV Bharat / state

శత్రువు వేషం మార్చినా గుర్తుపట్టే సాంకేతికత - తెలంగాణ వార్తలు

రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) పరిశోధనల్లో వేగం పెంచింది. వరుసగా క్షిపణి పరీక్షలు నిర్వహిస్తూనే... దేశాన్ని శత్రు దుర్భేద్యంగా మార్చేందుకు అవసరమైన కొత్తతరం ఆయుధ పరిజ్ఞానంపై దృష్టిపెట్టింది. ఇప్పటికే పలు సాంకేతికతలను అభివృద్ధి చేసి ప్రదర్శిస్తోంది. సైబర్‌ సెక్యూరిటీ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కృత్రిమ మేధ, ఆటోమేషన్‌పై ఎక్కువగా దృష్టి సారించింది. కొవిడ్‌పైనా పోరాటం చేస్తోంది. ఈ సందర్భంగా డీఆర్‌డీవో ఛైర్మన్‌ డాక్టర్‌ జి.సతీశ్‌రెడ్డితో ‘ఈటీవీ భారత్​’ ముఖాముఖి.

శత్రువు వేషం మార్చినా గుర్తుపట్టే సాంకేతికత

author img

By

Published : Dec 21, 2020, 6:48 AM IST

ప్రస్తుతం అన్ని రంగాల్లో కృత్రిమమేధ కీలకంగా మారింది. డీఆర్‌డీవో పరిశోధనలు ఏ దశలో ఉన్నాయి?

కృత్రిమ మేధతో ముఖ గుర్తింపు (ఫేస్‌ రికగ్నేషన్‌) సాంకేతికతపై శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. శత్రువులు వేషం మార్చినా ఫేస్‌ రికగ్నేషన్‌ సాంకేతికత గుర్తిస్తుంది. దేశ భద్రత దృష్ట్యా ఇది చాలా ప్రాధాన్యం సంతరించుకుంది. వేర్వేరు భాషలు మాట్లాడేటప్పుడు వాటంతట అవే తర్జుమా చేసేలా ‘లాంగ్వేజ్‌ ఆటోమేషన్‌’పై ప్రస్తుతం పరిశోధనలు జరుగుతున్నాయి. తొలుత హిందీ, ఆంగ్లం, మరికొన్ని భాషలపై పనిచేస్తున్నాం. ఉదాహరణకు చైనీస్‌లో లైవ్‌లో మాట్లాడుతుంటే ఇంగ్లిష్‌లో వినొచ్చు. కొన్ని భాషలతో మొదలు పెట్టి ఎక్కువ భాషలకు ఈ సాంకేతికతను విస్తరించనున్నాం.

ప్రయోగశాలల విస్తరణ ప్రణాళికలు ఎలా సాగుతున్నాయి?

కొత్త ప్రయోగశాల ఏర్పాటు ప్రతిపాదనలేమీ లేవు. ఇప్పటికే ఉన్న వాటిని విస్తరిస్తున్నాం. ఇదివరకే స్థలం తీసుకున్న నాగార్జునసాగర్‌ ప్రాంతంలో హై ఆల్టిట్యూడ్‌ ఇంజిన్‌ టెస్టింగ్‌ సదుపాయాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నాం. అత్యంత ఎత్తులోకి వెళ్లాక అక్కడ వేర్వేరు వాహకాల ఇంజిన్‌ పనితీరు ఎలా ఉంటుంది అనేది ముందే పరీక్షించేందుకు ఇది ఉపకరిస్తుంది. శామీర్‌పేటలోని అతిపెద్ద ప్రయోగశాలలో హైపర్‌సోనిక్‌ విండ్‌ టన్నెల్‌ టెస్టింగ్‌ కేంద్రం ఏర్పాటు చేశాం. ఇక్కడే పర్యావరణ ప్రభావాలను అంచనా వేసేందుకు కొత్తగా పేలుడు టెస్టింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నాం.

కొవిడ్‌పై పనిచేసే ఔషధాల పరిశోధనలు ఏ దశలో ఉన్నాయి?

రేడియేషన్‌పై పనిచేసే ఒక ఔషధాన్ని కొవిడ్‌ వైరస్‌పై ప్రయోగించి చూస్తే మెరుగైన ఫలితాలు కనిపించాయి. సీసీఎంబీతో కలిసి చేస్తున్న ఈ ప్రయోగాలకు సంబంధించి ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్‌ నడుస్తున్నాయి.

కొత్తగా ఈ ఏడాదే యంగ్‌ సైంటిస్ట్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు కదా.. పనితీరు ఎలా ఉంది?

హైదరాబాద్‌ సహా వేర్వేరు నగరాల్లో ఈ ల్యాబ్‌లు పనిచేస్తున్నాయి. భవిష్యత్తు సాంకేతికతలపై యువ శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. ఏడాదికాలంలో మంచి పరిశోధనలు జరిగాయి. రక్షణ సంస్థల వ్యూహాత్మక సమాచారం హ్యాకింగ్‌కి అవకాశం లేని క్వాంటమ్‌ కీ డిస్ట్రిబ్యూషన్‌ టెక్నాలజీని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. డ్రోన్‌ టెక్నాలజీలపైనా పనిచేస్తున్నారు. మనుషులు వెళ్లలేని ప్రదేశాల్లో డ్రోన్లనే ఆయుధాలుగా ఉపయోగించేలా పరిశోధనలు సాగుతున్నాయి.

ఇదీ చూడండి: ధరణి రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.106 కోట్ల ఆదాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.