ETV Bharat / state

Double Bedroom House Lucky Draw Hyderabad : డబుల్ బెడ్​రూం ఇళ్ల లక్కీ డ్రా ప్రారంభం - హైదరాబాద్ వార్తలు

Double Bedroom House Lucky Draw Hyderabad : తెలంగాణ ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న రెండు పడక గదుల ఇళ్ల కల నెరవేరనుంది. ఇవాళ 12000 లబ్దిదారులను వెల్లడించనున్నారు అధికారులు. దానికి తగిన ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్​ జిల్లా కలెక్టరేట్​ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్​ యాదవ్ లబ్ధిదారుల లక్కీ డ్రా ప్రక్రియ ప్రారంభించారు.

Double Bedroom House
Double Bedroom House Lucky Draw Today
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 24, 2023, 11:43 AM IST

Updated : Aug 24, 2023, 12:26 PM IST

Double Bedroom House Lucky Draw Hyderabad : తెలంగాణలో ఉంటున్న పేద ప్రజల సొంతింటి కల నేరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని పేద ప్రజలకు ఇళ్లు మంజూరు చేస్తోంది ప్రభుత్వం. రోజులుగా ఎదురుచూస్తున్న హైదరాబాద్​ లబ్ధిదారులు ఇవాళ లక్కీ డ్రా ద్వారా ఈ ఇళ్లను పొందబోతున్నారు. ఎప్పటికైనా సొంతిటిలో ఉండాలి అన్న వారి కోరిక ఈరోజు నెరవేరబోతోంది. గ్రేటర్​ హైదరాబాద్ నగరం​లో డబుల్​ బెడ్​రూం ఇళ్లు పొందేందుకు అర్హులైన 12 వేల మంది అదృష్టవంతుల కోసం ఇవాళ లక్రీ డ్రా తీస్తున్నారు.

Double Bedroom House Scheme Telangana : హైదరాబాద్​ మహా నగర పరిధిలోని 24 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఒక్కో నియోజకవర్గానికి 2500 మంది చొప్పున 60 వేల మంది జాబితాని రెడీ చేశారు. వీరందరిలో ఒక్కో నియోజకవర్గానికి 500 మందిని ఎంపిక చేశారు. వీరి పేర్లను లక్టీకాపూల్​లోని హైదరాబాద్​ జిల్లా కలెక్టరేట్​ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్​ యాదవ్ వెల్లడించారు. రెండు పడక గదుల లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేసేందుకు లక్కీడ్రా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసానితో పాటు హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ, ఎంపీ రంజిత్‌రెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పాల్గొన్నారు.

Double Bedroom Housing Community at Kollur : కొల్లూర్​లో ఆసియాలోనే అతిపెద్ద 2BHK ప్రాజెక్టు.. రేపే ప్రారంభోత్సవం

లక్కీ డ్రా ద్వార లబ్ధిదారుల ఎంపిక : లబ్ధిదారుల పేర్లు, వారి నంబర్లు ఒక డబ్బాలో వేసి లక్కీ డ్రా తీసినట్టు కాకుండా యాదృచ్ఛిక నమూనా (ర్యాండమైజేన్)​ సాఫ్ట్​వేర్​ ద్వారా పేర్లు, వివరాలు వెల్లడిస్తున్నారు. లబ్ధిదారుల పేర్లు స్పష్టంగా కనిపించేందుకు కలెక్టరేట్​ మీటింగ్​​ హాల్​ రెవెన్యూ అధికారులు ప్రత్యేక తెరలను ఏర్పాట్లు చేశారు. మంత్రులు తలసాని శ్రీనివాస్​ యాదవ్​, మహమూద్​ అలీతో పాటు హైదరాబాద్​, రంగారెడ్డి, మేడ్చల్​ జిల్లాల కలెక్టర్లు అమోయ్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌, మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి తదితరులు హాజరయ్యారు.

హైదరాబాద్​ నగరంలో నివసిస్తున్న పేద ప్రజలు ప్రభుత్వం ఉచితంగా కేటాయిస్తున్న రెండు పడకగదుల ఇళ్ల కోసం ముందు నుంచే దరఖాస్తులు చేసుకున్నారు. ఒక్కొక్క నియోజకవర్గం పరిధి నుంచి దాదాపు 5వేల నుంచి 10వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిని జీహెచ్​ఎంసీ అధికారులు, ఇతర శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దరఖాస్తుదారులు అర్హులో.. కాదో నిర్ధారించారు. లక్షల్లో దరఖాస్తులు రాగా.. వాటిలో 50శాతం దరఖాస్తులను మాత్రమే పరిశీలించారు.

సెప్టెంబరు మొదటి వారం నుంచి దశలవారీగా ఇళ్ల కేటాయింపు ప్రక్రియ ఉండనుంది. మిగిలిన దరఖాస్తుదారుల పరిశీలనను పూర్తి చేయనున్నారు అధికారులు. హైదరాబాద్ జిల్లాలో 15 నియోజకవర్గాల పరిధిలో లక్షా 61 వేయి మంది దరఖాస్తు చేసుకోగా 80వేల మంది చిరునామాలకు అధికారులు వెళ్లి వారి స్థితిగతులను పరిశీలించారు. అనంతరం నివేదిక సిద్దం చేసి రెవెన్యూ అధికారులకు వివరాలు సమర్పించారు.

KTR Review on Musi Development Project : మూసీ పరిధిలో ఆక్రమణల తొలగింపునకు ప్రత్యేక చర్యలు..

KTR on Double Bedroom Houses : 'ఆగస్టు మొదటివారం నుంచి రెండుపడక గదుల ఇళ్ల పంపిణీ'

Last Updated : Aug 24, 2023, 12:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.