రాష్ట్రంలో డిగ్రీ సీట్లు భారీగా మిగిలిపోవడంతో... వాటి భర్తీ కోసం దోస్త్ మరో అవకాశం ఇచ్చింది. ఈనెల 27 నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించింది. నాలుగు విడతల్లో జరిగిన కౌన్సిలింగ్‌లో సుమారు 2లక్షల సీట్లు భర్తీ కాగా.. మరో 2 లక్షల సీట్లు మిగిలాయి. ఈనెల 27 నుంచి డిసెంబరు 2 వరకు ప్రత్యేక డ్రైవ్ ఉంటుందని దోస్త్ కన్వీనర్ లింబాద్రి ప్రకటించారు.
ఇప్పటి వరకు డిగ్రీలో చేరని విద్యార్థులు ప్రత్యేక విడతలో పాల్గొనాలని ఆయన సూచించారు. డిసెంబరు 4న ప్రత్యేక డ్రైవ్ సీట్లను కేటాయించనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇదీ చదవండి: భారీ వర్షాలు.. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నదులు