ETV Bharat / state

నేటి నుంచి దోస్త్ ప్రత్యేక డ్రైవ్ - నేటి నుంచి దోస్త్ ప్రత్యేక డ్రైవ్

నేటి నుంచి ఈ నెల 13 వరకు రాష్ట్రంలో మిగిలిన డిగ్రీ సీట్ల భర్తీకి ప్రత్యేక విడత కౌన్సెలింగ్​ ప్రక్రియ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 2,12,611 సీట్లు అందుబాటులో ఉన్నాయని కన్వీనర్ ఆచార్య లింబాద్రి తెలిపారు.

నేటి నుంచి దోస్త్ ప్రత్యేక డ్రైవ్
author img

By

Published : Aug 9, 2019, 6:10 AM IST

Updated : Aug 9, 2019, 6:36 AM IST

రాష్ట్రంలో మిగిలిన డిగ్రీ సీట్ల భర్తీకి నేటి నుంచి దోస్త్ ప్రత్యేక డ్రైవ్ ప్రారంభం కానుంది. ఈనెల 13 వరకు దోస్త్​లో రిజిస్ట్రేషన్లు చేసుకుని.. కాలేజీలు, కోర్సుల వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని కన్వీనర్ ఆచార్య లింబాద్రి తెలిపారు. ఈనెల 14న ప్రత్యేక విడత డిగ్రీ సీట్లను కేటాయిస్తారు. ఈనెల 14 నుంచి 16 వరకు ఆన్​లైన్​లో బోధన రుసుము చెల్లించి.. కాలేజీల్లో చేరాలని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకోనివారు, చేసినా సీటు పొందని వారు, సీటు వచ్చినా కళాశాలల్లో చేరని వారు.. ఈ ప్రత్యేక విడత కౌన్సెలింగ్​ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవచ్చు.

సగానికిపైగా మిగిలిన సీట్లు

రాష్ట్రంలో ఈ ఏడాది సగానికి పైగా సీట్లు మిగిలాయి. దోస్త్ ద్వారా 980 కాలేజీల్లో 3,86,684 సీట్ల భర్తీ ప్రక్రియ చేపట్టగా.. కేవలం 1,74,073 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,12,611 డిగ్రీ సీట్లు ఇంకా అందుబాటులో ఉన్నాయి.

నేటి నుంచి దోస్త్ ప్రత్యేక డ్రైవ్

ఇదీ చదవండిః నేడు కృష్ణా, గోదావరి బోర్డుల సమావేశం

sample description
Last Updated : Aug 9, 2019, 6:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.