డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 3 విడతల్లో సీట్ల కేటాయింపు జరగనుందని అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 23 నుంచి జూన్ 3 వరకు మొదటి విడత రిజిస్ట్రేషన్లకు గడవు విధించినట్లు స్పష్టం చేశారు. ఈ నెల 25 నుంచి జూన్ 3 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చునని తెలిపారు. జూన్ 10 వరకు మొదటి విడత సీట్ల కేటాయింపు జరుగుతుందని ప్రకటించారు. జూన్ 10 నుంచి 15 వరకు రెండో విడత రిజిస్ట్రేషన్లు, 20న సీట్ల కేటాయింపు చేయనున్నట్లు అధికారులు చెప్పారు. జూన్ 20 నుంచి జూన్ 25 వరకు మూడో విడత రిజిస్ట్రేషన్లు, 29న డిగ్రీ సీట్ల కేటాయింపు చేపట్టనున్నట్లు తెలిపారు. జులై 1 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభమవుతాయని వారు వివరించారు.
దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేసిన విద్యామండలి - దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేసిన విద్యామండలి
డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల(దోస్త్) కోసం రాష్ట్ర ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 3 విడతల్లో సీట్ల కేటాయింపు జరగనుంది. ఈనెల 25 నుంచి 3 వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ జరగనుంది. జులై 1 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం కానున్నాయి.