డిగ్రీ ఆన్ లైన్ ప్రవేశాల ప్రక్రియ షెడ్యూలును సవరించారు. మొదటి విడత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల గడువును ఈనెల 24 వరకు పొడిగించినట్లు దోస్త్ కన్వీనర్ ఆచార్య లింబాద్రి తెలిపారు. ఈనెల 31న డిగ్రీ మొదటి విడత సీట్లు కేటాయించనున్నారు. మొదటి విడతలో సీటు పొందిన అభ్యర్థులు ఆగస్టు 1 నుంచి 5 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. రెండో విడత రిజిస్ట్రేషన్లు ఆగస్టు 1 నుంచి 9 వరకు... వెబ్ ఆప్షన్ల ఆగస్టు 2 నుంచి 9 వరకు నిర్వహించి.. ఆగస్టు 14న రెండో విడత డిగ్రీ సీట్లు కేటాయించనున్నారు.
ఇవాళ్టి వరకు లక్ష 40వేల మంది దోస్త్ రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని.. సుమారు 70శాతం మంది ఆధార్ అనుసంధాన మొబైల్ ద్వారా నమోదు చేసుకున్నారని తెలిపారు. మీసేవ కేంద్రాలు, టీఎస్ యాప్ ఫోలియోతో పాటు.. 105 సహాయ కేంద్రాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని లింబాద్రి తెలిపారు. డిగ్రీలో బీఏ హానర్స్ కోర్సు ప్రవేశ పెట్టే ఆలోచన ఉందని లింబాద్రి తెలిపారు.
ఇదీ చూడండి: 50 వేల ఉద్యోగాల భర్తీకి కార్యాచరణ: సీఎం కేసీఆర్