మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన వారెవరూ తప్పులు చేయొద్దని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తప్పుబట్టారు. అవినీతి ఎమ్మెల్యేలను పక్కన పెట్టుకుని.. కేటీఆర్ నీతులు చెబుతున్నారని ఆరోపించారు.
తెరాస పెద్దలు వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించారని రంగారెడ్డి ధ్వజమెత్తారు. ఆదిభట్ల, పెద్ద అంబర్‌పేట, బడంగపేటల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన వారిని మేయర్, ఛైర్మన్లను ఎలా చేశారని ప్రశ్నించారు. ఎన్నికల్లో అవినీతి అక్రమాలకు పాల్పడి తెరాస గెలిచిందని విమర్శించారు. చేతుల్లో అధికారం ఉందని విర్ర వీగొద్దని.. రానున్న కాలంలో ప్రజలే తెరాసకు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
ఇవీ చూడండి: స్టెప్పులేస్తూ... అవగాహన కల్పిస్తూ... విద్యార్థుల ఫ్లాష్‌మాబ్